Vasuki Indicus: టైటానోబోవా కన్నా పెద్ద పాము ఈ “వాసుకి”.. కచ్‌లో బయటపడిన అతిపెద్ద పాము శిలాజాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasuki Indicus: ప్రపంచంలో అతిపెద్ద పాము, అంతరించిపోయిన ‘‘టైటానోబోవా’’ అనుకుంటారు. అయితే, తాజాగా గుజరాత్‌లో కచ్ ప్రాంతంలో భారీ పాముకి సంబంధించిన శిలాజాలను పరిశోధకులు గుర్తించారు. బహుశా ఇదే ప్రపంచంలో అతిపెద్ద పాము కావచ్చని వారు చెబుతున్నారు. పరిశోధకులు ఈ పాముకు సంబంధించిన 27 ఎముకలను సంరక్షించారు. ఇవి పాము వెన్నుముకను ఏర్పరుస్తున్నాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ నుండి వచ్చిన కొత్త పరిశోధన ప్రకారం గుజరాత్‌లోని కచ్ నుండి వెలికితీసిన శిలాజాలు ఇప్పటివరకు జీవించిన అతిపెద్ద పాములలో ఒకదాని వెన్నెముకకు చెందినవి కావచ్చని భావిస్తు్న్నారు.
పనాంద్రో లిగ్నైట్ మైన్ నుంచి పరిశోధకులు పాము వెన్నెముక శిలాజాలను గుర్తించారు. ఇందులో కొన్ని కనెక్షన్లు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఇవి పూర్తిగా ఎదిగిన పాముకు సంబంధించినవిగా భావిస్తున్నారు. పాము దాదాపుగా 11 నుంచి 15 మీటర్ల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇది అంతరించిపోయిన టైటానోబోవాతో పోల్చుతున్నారు. ఇది ఇప్పటివరకు జీవించిన అతిపొడవైన పాముగా గుర్తింపు పొందింది. దీని పరిమాణం కారణంగా ఇది అనకొండ మాదిరిగా నెమ్మదిగా కదిలే ప్రెడేటర్ అయి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
Also Read
- Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
- Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
Read Also: Suspended: టీఐఎస్ఎస్ దళిత పీహెచ్‌డీ విద్యార్థిపై రెండేళ్ల పాటు వేటు.. కారణమిదే!
పరిశోధకులు కొత్తగా కనుగొన్న ఈ పాము జాతికి ‘‘ వాసుకి ఇండికస్’’(V. Indicus) అని పేరు పెట్టారు. వాసుకి అనేది శివుడి మెడలో ఉండే పాము పేరు. ఈ పేరు భారతదేశంలో ముడిపడి ఉన్నట్లు సూచిస్తుంది. ఈ వి.ఇండికస్ ఇప్పుడు అంతరించిపోయిన మాత్సోయడై(madtsoiidae) కుటుంబానికి చెందినది. ఇవి భారత్‌తో పాటు ఆఫ్రికా, యూరప్ ప్రాంతాల్లో నివసించినట్లు పరిశోధకులు చెప్పారు.
ఇది 56 నుండి 34 మిలియన్ సంవత్సరాల క్రితం ఈయోసిన్ సమయంలో దక్షిణ ఐరోపా మీదుగా ఆఫ్రికాకు వ్యాపించింది. ఆధునిక క్షీరద జాతుల మొదటి పూర్వీకులు, దగ్గరి బంధువులు ఈ ఈయోసిన్ కాలంలోనే నివసించారు. దాదాపుగా 47 మిలియన్ సంవత్సరాల క్రితం నాటి ఈయోసిన్ కాలం నాటి శిలాజాలను తాజాగా గుర్తించారు. వాసుకి. ఇండికస్ పాము వెన్నుపూస పొడవు 38 మి.మీ-62 మి.మీ మధ్య ఉండేది, అలాగే వెడల్పు 62 మి.మీ-111 మి.మీ మధ్య ఉంటూ స్తూపాకార శరీరాన్ని కలిగి ఉండొచ్చని పరిశోధకులు తెలిపారు. దీని కొలతలు 10.9 మరియు 15.2 మీటర్ల పొడవు ఉంటుందని, ఇది టైటానోబోవాతో పోల్చదగిందని చెప్పారు. ప్రస్తుత కొలంబియాలో 2000లో మొదటిసారిగా టైటానోబోవా శిలాజాలను పరిశోధకులు మొదటిసారిగా కనుగొన్నారు. టైటానోబోవా పాము పొడవు 12.8 మీ. నుంచి 14.3 వరకు ఉంటుందని అంచనా.
తాజావార్తలు
-
Road Accident: లారీ-ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీ.. బస్సులో 30 మంది ప్రయాణికులు.?
-
GST Scam: భారీ జీఎస్టీ స్కామ్.. అమాయకుల పత్రాలతో కోట్ల లావాదేవీలు.!
-
Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
-
Kash Patel Engaged: FBI డైరెక్టర్ కాష్ పటేల్‌కు ఎంగేజ్మెంట్.. ప్రియురాలు అలెక్సిస్ విల్కిన్స్ ఎవరు?
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!