Viral : ఈ మధ్యకాలంలో కొన్ని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో చాలా వేగంగా వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఏ చిన్న వేడుకైనా ఉత్సహం కోసం డ్యాన్స్ చేయడం పరిపాటి అయిపోయింది. ప్రస్తుతం ఎక్కడికెళ్లినా ఊపైన డ్యాన్స్ స్టెప్పులు ఉండాల్సిందే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది రీల్స్ చేసి పాపులర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఫ్లైట్‌లో డ్యాన్స్ చేస్తున్న ప్రయాణికుల వీడియో ఇటీవల వైరల్‌గా మారింది. అందులో కొందరు యువతులు డ్యాన్స్ చేస్తున్నారు. ఆ వీడియో కారణంగా సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ జరుగుతోంది.
Read Also : Adipurush: ఇది కదా ఆదిపురుష్ నుంచి మనకి కావాల్సిన స్టఫ్…
ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయబడింది. విమానంలో ప్రయాణికులు డ్యాన్స్ చేస్తున్నారు. ఒక వ్యక్తి ఆ విమానంలో డ్యాన్స్ చేస్తున్న వారి వెనుక పెద్ద స్పీకర్‌ను పట్టుకుని ఉన్నాడు. వీడియో చూసిన నెటిజన్లు ప్రయాణీకులు విమానాన్ని డ్యాన్స్ వేదికగా మార్చారని ప్రజలు భావిస్తున్నారు. ఈ వీడియో ఎప్పుడు తీశారో తెలియదు. హర్యానాకు చెందిన ఫేమస్ పాట “తేరీ ఆంఖ్ కా యో కాజల్” పాటకు ఒక ప్రయాణికుల బృందం డ్యాన్స్ చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో చూసిన చాలా మంది షాక్ అవుతున్నారు. ఈ వీడియోను యాంకర్ జేకే అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా షేర్ చేసింది. గాలిలో 37,000 అడుగుల ఎత్తులో విమానం ఎగురుతుండగా డ్యాన్స్ చేయడాన్ని నెటిజన్లు విమర్శిస్తున్నారు. చాలా మంది భద్రతా నిబంధనలను ఉల్లంఘించారని వారిపై చర్యలు తీసుకోవాలంటున్నారు.