★ ఏపీ హైకోర్టుకు నేటి నుంచి జూన్ 10 వరకు వేసవి సెలవులు.. సెలవుల్లో అత్యవసర పిటిషన్‌ల విచారణకు వెకేషన్ కోర్టులు
★ నెల్లూరు జిల్లాలో నేడు మంత్రి అంబటి రాంబాబు పర్యటన.. పెన్నా, సంగం బ్యారేజీల సందర్శన.. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం
★ శ్రీకాకుళం : నేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి విస్తృత సమావేశం.. హాజరుకానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు
★ గుంటూరు: నేడు డీజీపీని కలవనున్న బీజేపీ నేతలు.. సత్యసాయి జిల్లాలో బీఫార్మసీ విద్యార్ధిని తేజస్వీని మృతిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ డీజీపీకి వినతిపత్రం సమర్పించనున్న బీజేపీ ప్రతినిధి బృందం
★ శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో నేడు జిల్లా అభివృద్ధి మండలి (DRC) సమావేశం.. పాల్గొననున్న జిల్లా ఇంఛార్జి మంత్రి బొత్స, మంత్రులు సీదిరి , ధర్మాన, స్పీకర్ తమ్మినేని
★ కర్నూలు: నేడు పత్తికొండలో జిల్లా అధికారులతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి సమీక్ష
★ నేడు ఏపీ సెక్రటేరియట్ ముట్టడికి వామపక్షాల పిలుపు.. పెరిగిన గ్యాస్ ధరలపై నేడు వామపక్షాల నిరసన.. జిల్లాలలో సీపీఐ, సీపీఎం నేతల ముందస్తు అరెస్టులు
★ నేడు నారాయణపేట జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న కేటీఆర్.. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్న కేటీఆర్
★ నేడు సుప్రీంకోర్టులో ఇద్దరు కొత్త జడ్జిల ప్రమాణస్వీకారం.. జస్టిస్ సుధాంశు ధులియా, జస్టిస్ జేబీ పర్దీవాలాలతో ప్రమాణ స్వీకారం చేయించనున్న సీజేఐ ఎన్వీ రమణ
★ ఢిల్లీ: సాయంత్రం 4 గంటలకు సీడబ్ల్యూసీ సమావేశం.. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ వ్యూహాలు, కార్యాచరణపై చర్చ. పలు కీలక అంశాలపై తీర్మానాల ముసాయిదాలు సిద్ధం.. తీర్మానాలపై నవ సంకల్ప్ చింతన్ శిబిర్‌లో చర్చ
★ రష్యాలో నేడు విక్టరీ డే ఉత్సవాలు.. రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓటమికి గుర్తుగా విక్టరీ డే
★ ఐపీఎల్-2022: నేడు డీవై పాటిల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్‌తో తలపడనున్న కోల్‌కతా నైట్‌రైడర్స్.. రాత్రి 7:30 గంటలకు మ్యాచ్