1. హైదరాబాద్‌లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,300 లు ఉండగా. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.60,700 లుగా ఉంది.
2. నేటి నుంచి యూఎస్ ఓపెన్ టోర్నీ. రాత్రి 8.30 గంటలకు తొలి మ్యాచ్ ప్రారంభం. ఆఖరి గ్రాండ్స్ స్లామ్ ఆడనున్న సెరెనా.
3. నేడు అమెరికాలో ఆర్టెమిస్-1 ప్రయోగం. ఫ్లోరిడాలోని కెనెడీ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లనున్న ఎస్ఎల్ఎస్. వ్యోమగాములు లేకుండా చంద్రుడిపైకి స్పేస్‌షిప్.
4. నేడు రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సమావేశం. ముఖేష్ అంబానీ కీలక ప్రకటన చేసే అవకాశం.
5. నేడు పెద్దపల్లి జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన. జిల్లా కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న కేసీఆర్. జిల్లా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం. తర్వాత బహిరంగ సభలో ప్రసంగించనున్న కేసీఆర్. కరీంనగర్ బైపాస్ మీదుగా ర్యాలీగా పెద్దపల్లికి పయనం.