1. నేడు ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్. పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలాసీతారామన్. ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్. ఉదయం 9గంటలకు రాష్ట్రపతిని కలవనున్న నిర్మలాసీతారామన్. బడ్జెట్‌పై రాష్ట్రపతికి సమాచారం ఇవ్వనున్న నిర్మలాసీతారామన్.
2. బెంగళూరు నారాయణ హృదయాలయలో తారకరత్న. నేడు మరిన్ని పరీక్షలు నిర్వహించనున్న డాక్టర్లు. మధ్యాహ్నం తారకరత్న హెల్త్‌పై ప్రకటన చేసే అవకాశం.
3. నేడు భారత్-న్యూజిలాండ్ చివరి టీ20 మ్యాచ్. రాత్రి 7గంటలకు అహ్మదాబాద్‌లో మ్యాచ్.
4. నేడు కోనసీమ జిల్లా అంతర్వేదిలో కల్యాణ మహోత్సవం. తలంబ్రాల ఘట్టానికి భారీగా హాజరైన భక్తులు. పూజలో పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు.
5. కేంద్ర బడ్జెట్‌పై ప్రచారానికి బీజేపీ నిర్ణయం. నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రచార కార్యక్రమాలు. 12 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు.
6. నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,500 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,270 లుగా ఉంది. అలా కిలో వెండి ధర రూ.74,500 లుగా ఉంది.
7. నేటి నంచి మేడారంలో మండమెలిగే పండుగ. ఈ నెల 4 వరకు చిన్న జాతర పేరుతో నిర్వహణ. జాతర కోసం ఏర్పాట్లు చేసిన అధికారులు.
8. నేడు తెలంగాణలో మన ఊరు- మన బడి కార్యక్రమం. పనులు పూర్తైన 680 పాఠశాలల ప్రారంభోత్సవం. సిరిసిల్లలో పాల్గొననున్న మంత్రులు కేటీఆర్, సబిత. తొలి విడతలో 9123 పాఠశాలలు ఎంపిక చేసిన ప్రభుత్వం. రూ.3,497 కోట్లతో 12 రకాల సౌకర్యాల కల్పనకు నిర్ణయం.