నేటి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 4వ విడత వారాహియాత్ర ఆరంభం కానుంది. కృష్ణా జిల్లా నుంచి వారాహియాత్ర ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు అవనిగడ్డ బహిరంగసభతో పవన్ వారాహియాత్ర ఆరంభం అవుతుంది. జనసేన, టీడీపీ, బీజేపీ కలయికతో వారాహియాత్ర జరగనుంది.
నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 1.30కి శంషాబాద్ విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు. మహబూబ్‌నగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంబోత్సవాలు చేయనున్నారు. ఆపై మహబూబ్‌నగర్‌లో ర్యాలీలో ప్రధాని పాల్గొననున్నారు. ఇక పాలమూరు ప్రజాగర్జన సభలో ఆయన ప్రసంగించనున్నారు. సాయంత్రం 4.45కి ప్రధాని ఢిల్లీకి బయలుదేరుతారు.
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిన విషయం తెలిసిందే. ఆ అల్పపీడనానికి అనుబంధంగా ఆవర్తనం కొనసాగుతోంది. దాంతో రానున్న మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Also Read: PM Modi: నేడు తెలంగాణలో పర్యటించనున్న ప్రధాని మోడీ.. షెడ్యూల్ ఇదే..?
శనివారం జరగాల్సిన భారత్, ఇంగ్లండ్ వార్మప్ మ్యాచ్ వర్షార్పణం అయింది. ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ ప్రాక్టీస్ మ్యాచ్ కూడా వాన వల్ల రద్దయింది. ఇక అక్టోబరు 3న నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. ఈ రోజు వార్మప్ మ్యాచ్‌లు లేవు. సోమవారం రెండు వార్మప్ మ్యాచ్‌లు ఉన్నాయి.