* IPL: నేడు ఆర్సీబీ వర్సెస్ లక్నో.. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్
* ఢిల్లీ: నేడు ఇండియా కూటమి నేతల కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై చర్చించనున్న నేతలు.. మధ్యాహ్నం 3 గంటలకు మల్లికార్జున ఖర్గే నివాసంలో సమావేశం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్లు, డీలిమిటేషన్‌పై చర్చ.. కేంద్రం నుంచి అధికారిక అజెండా రావడంతో ఇవాళ్టి ఇండియా కూటమి సమావేశానికి ప్రాధాన్యత..
* బీహార్ ముఖ్యమంత్రిగా ఈ రోజు సామ్రాట్ చౌదరి ప్రమాణస్వీకారం.. బీహార్ నుంచి తొలి బీజేపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న సామ్రాట్ చౌదరి
* నేడు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటన.. రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలలో 62 అన్న క్యాంటీన్లను వర్చువల్‌గా ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
* అమరావతి: ఇవాళ ఉదయం 10.31 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు విడుదల..
* అమరావతి: ఇవాళ సీఎం చంద్రబాబు నివాసంలో ఎన్డీఏ నేతల భేటీ. సాయంత్రం 5 గంటలకు ఎన్డీఏ నేతల సమావేశం. హాజరుకానున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఇతర కూటమి నేతలు. మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లుతో పాటు తాజా పరిణామాల పై చర్చ.
* అనంతపురం : ఉరవకొండ పట్టణంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించనున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* కాకినాడ: ఇవాళ్టి నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేట నిషేధం.. సంతానోత్పత్తికి ఇబ్బందులు లేకుండా ప్రతి ఏడాది చేపల వేట నిషేధం.. వేట నిషేధం ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, బోటు స్వాధీనం, రిజిస్ట్రేషన్ రద్దు.. మత్స్యకార భరోసా కింద రూ.20 వేలు అందించనున్న ప్రభుత్వం
* ఇవాళ నెల్లూరు జిల్లాలో వైఎస్ జగన్ పర్యటన.. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించనున్న జగన్.. మత్స్యకారులతో సమావేశం..
* తూర్పుగోదావరి జిల్లా: పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నేటి కార్యక్రమాలు.. ఉదయం 9:30కి నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో SC, ST లకు SC కాలనీ నందు ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజలి యోజన పధకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు.. మధ్యాహ్నం 3 గంటలకు ఉండ్రాజవరం మండలం, వడ్లూరు గ్రామం PACS వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
* నేడు నెల్లూరులో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి కుమారుడు వివాహ రిసెప్షన్.. హాజరుకానున్న మంత్రులు లోకేష్, బీసీ జనార్దన్ రెడ్డి, పొంగూరు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఇతర ఎమ్మెల్యేలు
* నేడు రాజమండ్రి కోర్టు ముందుకు మరోసారి హాజరుకానున్న డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసులో రెండవ ముద్దాయిగా ఉన్న అనంత బాబు భార్య లక్ష్మీ దుర్గ.. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ లక్ష్మీ దుర్గ వేసిన పిటిషన్ పై ఈ రోజు జిల్లా జడ్జి కోర్టులో తీర్పు.
* కర్నూలు: నేడు గూడూరు శ్రీ తిమ్మగురుడు స్వామి తిరునాళ్ల మహోత్సవాలలో పారువేట
* కర్నూలు: నేడు జిల్లా పోలీసు కార్యాలయంలో మొబైల్ మేళా.. చోరీకి గురైన, పోగొట్టుకున్న సెల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు ఇవ్వనున్న పోలీసులు
* తిరుమల: 23 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు .. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 79,426 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 25,889 మంది భక్తులు .. హుండీ ఆదాయం రూ.3.98 కోట్లు
* ఖమ్మం: పెనుబల్లి, కల్లూరు, సత్తుపల్లిలో వైద్య ఆరోగ్యశాఖ ఆసుపత్రి భవనాలను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
* ఆదిలాబాద్: నేడు జిల్లా లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
* నిజమాబాద్: నేడు జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.. అలైవ్ కార్యక్రమంలో భాగంగా బైక్ ర్యాలీలో పాల్గొననున్న మంత్రి.. డి. ఎస్. చౌరస్తా లో మానవహారం.