* నేటి నుంచి ఈ నెల 18 వరకు పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్.. ఈ కైట్ ఫెస్టివల్ కు 19 దేశాలకు చెందిన 40 మంది ఇంటర్నేషనల్ ప్లేయర్స్ తో పాటు దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి 55 మంది ప్లేయర్స్ రాక..
* నేడు ఖమ్మం జిల్లాలోని మంచుకొండ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..
* నేడు భద్రాద్రి జిల్లాలోని అశ్వరావుపేటలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..
* నేటి నుంచి నాలుగు రోజుల పాటు స్వగ్రామం నారావారిపల్లెలోనే సీఎం చంద్రబాబు.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు.. అనంతరం సంక్రాంతి సంబరాల్లో పాల్గొననున్న చంద్రబాబు..
* నేడు శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి సత్యకుమార్ యాదవ్ పర్యటన.. ఉదయం 10:30 నిమిషాలకు ధర్మవరం పట్టణం, కళ్యాణజ్యోతి సర్కిల్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ రథ మండపానికి శంకుస్థాపన.. మధ్యాహ్నం 12:30 నిమిషాలకు ముదిగుబ్బ మండలంలోని అడవి బ్రాహ్మణపల్లి తాండ గ్రామంలో మారెమ్మ తల్లి జాతర పల్లకి సేవా కార్యక్రమం.. మధ్యాహ్నం 03:00 గంటలకు ధర్మవరం ఎన్డీఏ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండనున్న మంత్రి సత్యకుమార్..
* నేటితో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో ముగియనున్న డ్రాగన్ పడవల పోటీలు.. సెమీఫైనల్స్ కు చేరిన ఆరు జట్లు.. ఉదయం సెమీఫైనల్స్, మధ్యాహ్నం ఫైనల్స్ పోటీలు.. మొదటి బహుమతిగా రెండు లక్షల రూపాయలు.. రెండో బహుమతిగా లక్ష రూపాయలు.. మూడో బహుమతిగా 50 వేల రూపాయలు.. ఉత్కంఠ భరితంగా జరగనున్న డ్రాగన్ పడవ పోటీలు
* నేడు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 12 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనానికి 8 గంటల సమయం..
* నేడు శ్రీశైలంలో రెండోరోజు మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు.. సాయంకాలం బృంగివాహనంపై ఆశీనులై.. ప్రత్యేక పూజలు అందుకోనున్న శ్రీ మల్లన్నస్వామి అమ్మవార్లు.. సాయంత్రం క్షేత్ర పుర వీధుల్లో ఆది దంపతులకు గ్రామోత్సవం..
* నేడు వేములవాడ భీమన్న క్షేత్రంలో పోటెత్తిన భక్తజన సంద్రం.. సంక్రాంతి సెలవుల ఎఫెక్ట్.. పదివేల కోడె మొక్కులను చెల్లించుకున్న భక్తులు..
* నేడు డబ్ల్యూపీఎల్ లో గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య మ్యాచ్.. రాత్రి 7: 30 గంటలకి మ్యాచ్..