* నేడు మెదక్ జిల్లాలో రెండో రోజు సీఎం కేసీఆర్ పర్యటన.. నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్..
* ఆదిలాబాద్: నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలు.. ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాల్లో సీఎం సభలు.
* నిజామాబాద్: నేడు జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ.. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సీఎం సభ
* నేడు మేడ్చల్ నియోజకవర్గంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం.. జవహర్ నగర్, మేడ్చల్ ప్రాంతాల్లో కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న రేవంత్ రెడ్డి.. ఉదయం 11 గంటలకు జవహర్ నగర్, మధ్యాహ్నం 12 గంటలకు మేడ్చల్ కార్నర్ మీటింగ్స్ లో పాల్గొననున్న రేవంత్
* నేడు సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పర్యటన.. గజ్వేల్ నియోజకవర్గంలోని వర్గల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్న ఈటల
* నేడు సంగారెడ్డి జిల్లాలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పర్యటన.. పటాన్ చెరులో బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కి మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న బండి సంజయ్
* హైదరాబాద్: ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ప్రకటించిన కార్మిక శాఖ
* ప్రకాశం : యర్రగొండపాలెంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్న మంత్రి ఆదిమూలపు సురేష్..
* ఒంగోలులో టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ సమావేశం, హాజరుకానున్న పలువురు ముఖ్య నేతలు..
* ప్రకాశం : ఒంగోలులో నూతన సబ్ స్టేషన్ కు భూమి పూజా కార్యక్రమంలో పాల్గొననున్న మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి..
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు.. వెంకటాచలం మండలాల్లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు
* నేడు నెల్లూరుకు చేరుకోనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి.. రేపు నెల్లూరులో జరిగే బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న పురంధేశ్వరి..
* నెల్లూరు: మర్రిపాడు మండలంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి
* తిరుమల: రేపు నాగులచవితి సందర్భంగా పెద్దశేష వాహనం.. రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహనంపై భక్తలకు దర్శనం ఇవ్వనున్న శ్రీదేవి భూదేవి సమేతుడైన మలయప్ప స్వామి
* తిరుమల: ఎల్లుండి పుష్పయాగానికి అంకురార్పణ.. 19వ తేదీన 7 టన్నుల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన చేయనున్న అర్చకులు
* తిరుమల: 23వ తేదీ నుంచి అలిపిరి వద్ద శ్రీశ్రీనివాస మహశాంతి విశేష హోమం ప్రారంభం.. ఇవాళ నుంచి ఆన్ లైన్ లో హోమం టికెట్లను విక్రయించనున్న టీటీడీ
* ప్రకాశం : చీమకుర్తిలో జెడ్పీ సీఈవో జాలిరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం..
* ప్రకాశం : కంభంలో రేపు కలెక్టర్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* తూర్పుగోదావరి జిల్లా: రేపు కులగణనపై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రాజమండ్రిలో రౌండ్ టేబుల్ సమావేశం.. మేధావి వర్గం, కుల సంఘాల నేతలు విలువైన సూచనలు అందచేయాలి-జిల్లా కలెక్టర్ మాధవీలత
* అంబేద్కర్ కోనసీమ జిల్లా: నేడు కొత్తపేటలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర.. 2 గంటలకు రావులపాలెం నుంచి యాత్ర ప్రారంభం.. యాత్ర రావులపాలెం, పెంకులపాటిగరువు , మందపల్లి, కొత్తపేట.. కొత్తపేట పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద 4 గంటలకు బహిరంగ సభ.. యాత్రలో పాల్గొననున్న పార్టీ ముఖ్యనేతలు.. యాత్ర సందర్బంగా కొత్తపేటలో ట్రాఫిక్ మళ్ళింపు.. అమలాపురం, ముక్కామల మరియు అవిడి నుంచి కొత్తపేట మీదుగా రావులపాలెం వెళ్ళు వాహనములు పలివెల నుండి వేదిరేశ్వరం కాలువ గట్టు మీదుగా మరియు గంటి చెక్ పోస్ట్, ఈతకోట మీదుగా రావులపాలెం కు మళ్ళింపు.. రావులపాలెం నుండి అమలాపురం వైపు వెళ్ళే వాహనాలను కొత్తపేట బొడిపాలెం బ్రిడ్జ్ దగ్గర నుండి వాడపాలెం, వానపల్లి, ముక్తేశ్వరం మీదుగా అమలాపురం కు మళ్ళింపు
* శ్రీ సత్యసాయి : ఇవాళ టిడిపి – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.
* నేడు గుంటూరులో బీజేపీ చీఫ్ పురందరేశ్వరి పర్యటన.. ఉదయం 10 గంటలకు లాం అగ్రికల్చరల్ యూనివర్సిటీ ని సందర్శించనున్న పురందరేశ్వరి.. అనంతరం బండ్లమూడి గార్డెన్స్ లో బూత్ లెవెల్ కమిటీల సమావేశంలో పాల్గొననున్న బీజేపీ అధ్యక్షురాలు.
* గుంటూరు: నేడు మంగళగిరిలో టిడిపి, జనసేన నాయకుల ఆత్మీయ సమావేశం …
* గుంటూరు : నేడు కాకుమాను మండలం కొమ్మూరులో పల్లెకు పోదాం కార్యక్రమం.. హాజరుకానున్న అధికారులు, ప్రజాప్రతినిధులు..
* తిరుపతి: వైభవంగా సాగుతున్న పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు.. ఉత్సవాల్లో నేటి ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న పద్మావతి అమ్మవారు
* తిరుమల: 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71,123 మంది భక్తులు.. తలనీలాలు సమర్పించిన 26,689 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.84 కోట్లు