* హైదరాబాద్ : ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్
* విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్ ఉత్తరాంధ్ర పర్యటన.. ఋషికొండ హిల్ నెంబర్-4లో వైజాగ్ టెక్ పార్క్ నిర్మాణం, 200 మెగావాట్ల ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్న సీఎం. రూ.14,634 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్న అదానీ గ్రూప్.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 24వేల మందికి ఉపాధి లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం.
* విశాఖ: సీఎం పర్యటన కోసం భారీ భద్రత ఏర్పాట్లు.. ఋషికొండ ఐటీ పార్క్ ఏరియాలో 1300మంది పోలీసులు బందోబస్తు.. హిల్ నెంబర్ 3 సమీపంలో హెలీ పాడ్.. టెక్ పార్క్ భూమి పూజ తర్వాత ఎంపీ ఎంవీవీ సత్యన్నారాయణ ఇంటికి వెళ్ళనున్న సీఎం
* విజయనగరం: భోగాపురం ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్డ్, ఫ్లోటింగ్ జెట్టీ, తారక రామతీర్ధ సాగర్ ప్రాజెక్టు మిగులు పనులకు నేడు శంకుస్థాపన చేయునున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి..
* విశాఖ: నేడు నగరానికి ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ.. ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ నిర్మాణం భూమి పూజలో పాల్గొనున్న అదానీ..
* వరంగల్: నేటితో శ్రీభద్రకాళి-భద్రేశ్వరుల బ్రహ్మోత్సవాల ముగింపు
* హైదరాబాద్: నేడు GHMC కౌన్సిల్ సమావేశం.. నెల రోజులు ఆలస్యంగా జరుగుతున్న సమావేశం.. అకాల వర్షాల నేపథ్యంలో నగరంలో ఏర్పడిన ఇబ్బందులపై చర్చ
* నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన.. జిలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి హరీష్ రావు
* సిరిసిల్ల జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర్యటన.. నేడు ఉదయం 11.30 గంటలకు సిరిసిల్ల జిల్లా గంభీరావ్ పేట్ మండలంలోని నాగంపేట గ్రామంలో వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్న సంజయ్.. మిడ్ మానేరు ముంపు బాధిత గ్రామాలైన వేములవాడ నియోజకవర్గంలోని చీర్లవంచ, రుద్రవరం గ్రామాల్లో పర్యటన.
* ప్రకాశం : పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెం పట్టణంలోని ఇందిరానగర్ లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* ఒంగోలు కలెక్టరేట్ లో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్పందన కార్యక్రమం..
* కడప : దేవుని కడపలో నేటి నుంచి మూడు రోజుల పాటు తెప్పోత్సవాలు..
* కడప జిల్లా కోర్టులో పనిచేస్తున్న అడ్వకేట్ సి.సుబ్రమణ్యం పట్ల పోలీసులు అమానుష చర్యలను ఖండించిన కడప బార్ అసోసియేషన్.. పోలీసుల తీరును నిరసిస్తూ నేడు కోర్ట్ విధులను బహిష్కరిస్తూ బార్ కౌన్సిల్ నిర్ణయం.
* నెల్లూరు జిల్లా: రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పొదలకూరు మండలంలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారు
* నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షిత్తాయి అమ్మవారి ఆలయంలో కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో కుంభాభిషేకం
* విశాఖ: స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం నేడు రాష్ట్ర వ్యాప్త రాస్తోరోకోలు.. గాజువాక, కూర్మన్నపాలెం, అగనంపూడి దగ్గర హైవేను దిగ్భందించనున్న ఉక్కు కార్మికులు….
* 88వ రోజుకు చేరిన నారా లోకేష్ పాదయాత్ర కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి పాదయాత్ర ప్రారంభం.. కోడుమూరు, వెంకటగిరి, చిలబండ , యర్రదొడ్డి, అనుగొండ, రేమండూరులో కొనసాగనున్న పాదయాత్ర
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్న మంత్రి దాడిశెట్టి రాజా
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన..
* నంద్యాల: అవుకులో శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు నేటి నుండి ప్రారంభం.. నేడు ధ్వజారోహణం, అంకురార్పణ, కలశ స్థాపన, విశేష పూజలు
* ఏలూరు జిల్లా: ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం హనుమత్ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం.. రాత్రికి ఎదుర్కోలు ఉత్సవం..
* అనంతపురం : కళ్యాణదుర్గంలో పర్యటించనున్న మంత్రి ఉషశ్రీ చరణ్.
* అనంతపురం : రాయదుర్గంలో నేటి నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. ఈనెల 8 న శ్రీవారి కళ్యాణోత్సవం.10 న బ్రహ్మరథోత్సవం.
* శ్రీ సత్యసాయి : ధర్మవరంలో లక్ష్మీచెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలు.
* రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్న దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,789 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 27,684 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.4.35 కోట్లు