* నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు బంద్.. ఉదయం 6 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ కార్మికులు.. రాజ్ భవన్ ముట్టడికి పిలుపు.. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీన బిల్లును వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్.
* చిత్తూరు: పుంగనూరులో హింసాత్మక ఘటననపై చిత్తూరు బంద్‌కు వైసీపీ పిలుపు.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న బంద్
* తిరుమల: 29 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు, టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 69,270 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 28,755 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
* తిరుపతి: ఈ రోజు ఉదయం 10 గంటలకు రేణిగుంట Y. కన్వెన్షన్ హాల్‌లో చంద్రబాబు నాయుడుకు ప్రెస్ మీట్.. పుంగనూరు ఘటనపై స్పందించనున్న బాబు
* ప్రకాశం : త్రిపురాంతకం మండలం నడిగడ్డలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్..
* ప్రకాశం : మార్కాపురంలో నూతనంగా నిర్మించిన లక్కీ షాపింగ్ మాల్ ను ఈ రోజు ప్రారంభించనున్న హీరోయిన్ హని రోజ్…
* ఒంగోలులోని జిల్లా న్యాయస్థానం ప్రాంగణంలో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం, ముఖ్య అతిథిగా హాజరుకానున్న హైకోర్టు న్యాయమూర్తి కే.మన్మధరావు..
* నేడు ఏలూరులో జెడ్పీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం.. హాజరు కానున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, zp సభ్యులు..
* తూర్పుగోదావరి జిల్లా: ఈనెల 7న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న చంద్రబాబు నాయుడు.. అనంతరం రాత్రికి చంద్రబాబు రాజమండ్రిలో బస, ఈనెల 8న రాజమండ్రిలో సాగునీటి ప్రాజెక్టులపై మేధావులతో చంద్రబాబు సమావేశం
* తిరుమల: ఎల్లుండి టిటిడి పాలకమండలి సమావేశం. 8వ తేతీతో ముగియనున్న టీటీడీ పాలకమండలి గడువు. నాలుగు సంవత్సరాల పాటు టీటీడీ చైర్మన్ గా కొనసాగిన వైవీ సుబ్బారెడ్డి.. మరోసారి కొనసాగేందుకు విముఖత చూపని వైవీ సుబ్బారెడ్డి.. ఎన్నికల ఏడాది కావడంతో రాజకీయాలపై దృష్టి పెట్టే యోచనలో వైవీ సుబ్బారెడ్డి, నూతన చైర్మన్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి, రేసులో ముందున్న వైసీపీ సీనియర్ నేత, తిరుపతి ఎమ్మేల్యే కరుణాకర్ రెడ్డి
* తూర్పుగోదావరి జిల్లా: నేడు రాజమండ్రిలో సందడి చేయనున్న సినీనటి ప్రాచీ టెహలాన్
* తిరుమల: 21వ తేదీన గరుడ పంచమి సందర్భంగా గరుడ వాహన సేవ, రాత్రి 7 గంటలకు గరుడ వాహనం పై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: 26వ తేదీన పవిత్రోత్సవాలుకు అంకురార్పణ, 27 నుంచి 29 వ తేదీ వరకు మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలను నిర్వహించనున్న టీటీడీ
* బాపట్ల: వేమూరు మండలం పెరవల్లి పాలెంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి మేరుగ నాగార్జున….
* పల్నాడు: వినుకొండ నియోజక వర్గంలో కొనసాగుతున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర
* తూర్పుగోదావరి జిల్లా: నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన, చాగల్లు మండలం మార్కొండపాడు సొసైటీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం సమీక్షలో పాల్గొంటారు. కొవ్వూరు టౌన్ లో శ్రీరామ సొసైటీ లో నిర్వహించే సొసైటీ పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామం సూరయ్యపేట నందు జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు.
* అనంతపురం : నేడు జిల్లాలో పర్యటించనున్న ఇంఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. కళ్యాణదుర్గం,గుంతకల్లు నియోజకవర్గాల రివ్యూలో పాల్గొననున్న మంత్రి.