* ఇవాళ సుప్రీంకోర్టులో మణిపూర్ అల్లర్లపై మరోసారి విచారణ.. మణిపూర్ పరిస్థితులను చక్కదిద్దేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వనున్న సుప్రీం.. కేసును విచారణ జరుపుతున్న సీజేఐ ధర్మాసనం
* జయశంకర్ భూపాలపల్లి జిల్లా: నేడు మోరంచపల్లి గ్రామాన్ని పరిశీలించనున్న కేంద్ర బృందం.. మోరంచపల్లిలో జరిగిన నష్టంపై నివేదిక తయారు చేయనున్న సెంట్రల్ టీమ్..
* విశాఖ: నేడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన.. కైలాసపురంలో 600 కోట్లతో నిర్మించనున్న ఇనార్బిట్ మాల్ కోసం భూమి పూజ.. జీవీఎంసీకి చెందిన 135.88 కోట్లతో 50 పనులకు శంఖుస్థాపన చేయనున్న సీఎం వైఎస్ జగన్.. ఆంధ్రా యూనివర్సిటీలో ఆ హబ్ తో పాటు 4 ఇంక్యు బేషన్ సెంటర్ల ప్రారంభించనున్న సీఎం..
* తిరుమల: ఇవాళ అధికమాస శ్రావణ పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవ.. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్న మలయప్పస్వామి
* తిరుమల: నేటి నుంచి నెల రోజులు పాటు శ్రీవారి పుష్కరిణి మూసివేత.. నెల రోజులు పాటు పుష్కరిణి హారతి రద్దు చేసిన టీటీడీ
* కర్నూలు జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన.. నందికొట్కూరులో రోడ్ షో, బహిరంగసభ.. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం, బనకచర్ల హెడ్ రెగ్యులేటర్ పరిశీలించనున్న చంద్రబాబు
* అమరావతి: మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్.. మూడో విడత వారాహి యాత్రపై పార్టీ నేతలతో ఈ రోజు చర్చించే అవకాశం
* బాపట్ల : చీరాలలో భద్రాచల ప్రచార రథంతో శ్రీ సీతారాముల వారి శోభాయాత్ర.. అనంతరం దేవతామూర్తుల ఎదురు కోలాట ప్రదర్శన..
* నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగలో పాల్గొననున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
* నెల్లూరులోని శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో గోపురోత్సవ కార్యక్రమం
* తూర్పుగోదావరి జిల్లా : గోదావరి వరద ఉధృతి తగ్గడంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ.. బ్యారేజ్ వద్ద 13.2 అడుగులకు తగ్గిన వరద నీటిమట్టం.. 11 లక్షల 90 వేల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల.. కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక
* తూర్పుగోదావరి జిల్లాలో నేడు హోం మంత్రి తానేటి వనిత పర్యటన.. గోపాలపురం కొండవీటి డిగ్రీ కాలేజ్ నందు జరుగు క్యాపింగ్ డే వేడుకల్లో పాల్గొంటారు, కొవ్వూరు టౌన్ 10వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి
* కాకినాడ: నేడు తునిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనున్న మంత్రి రాజా
* నెల్లూరు జిల్లా: చంద్రయాన్-3 ప్రయోగంలో మరో ముందడుగు.. కక్షను పెంచి ట్రాన్స్ లూనార్ ఆర్బిట్‌లోకి ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు.. ఆగస్టు 5న చంద్రుడి కక్షలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు
* అనంతపురం : అధిక పౌర్ణమి పురస్కరించుకుని నగరంలోని శివకోటి ఆలయంలో సామూహిక సత్యనారాయణ వత్రాలు.
* పశ్చిమ గోదావరి: తగ్గు ముఖం పట్టిన గోదావరి వరద.. ముంపు నుంచి బయట పడుతున్న యలమంచిలి, ఆచంట మండలాల లంక గ్రామాలు..
* గుంటూరు ఛానల్ ను పర్చూరు వరకు పొడిగించాలని డిమాండ్ చేస్తూ నేడు రైతుల పాదయాత్ర.. పెదనందిపాడు నుండి తాడేపల్లి సీఎం కార్యాలయం వరకు పాదయాత్రకు పిలుపునిచ్చిన రైతులు, సీఎం కార్యాలయం ముట్టడికి యత్నిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రైతులను హెచ్చరించిన పోలీసులు.
* ప్రకాశం : నారా లోకేష్ యువగళం పాదయాత్ర.. ముండ్లమురు మండలం కెల్లంపల్లి క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభించి.. అనంతరం పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్న లోకేష్
* పల్నాడు: నేడు వినుకొండ నియోజకవర్గంలోకి ప్రవేశించనున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర, ప్రకాశం జిల్లా నుండి పల్నాడు జిల్లాకు చేరుకోనున్న నారా లోకేష్.. వినుకొండ నియోజకవర్గం లో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు. సమశ్యాత్మక గ్రామాల వైపు పాదయాత్ర వెళ్లకుండా పోలీసు శాఖ చర్యలు.
* నేడు పల్నాడు జిల్లా కెల్లంపల్లి నుండి ప్రారంభమవునున్న యువగళం పాదయాత్ర.. ముప్పరాజువారిపాలెం, రాముడుపాలెం, పచ్చ నూతల, కొత్త రెడ్డిపాలెం, లక్ష్మీపురం, నూజెండ్ల మీదుగా గుర్రపు నాయుడు పాలెం వరకు సాగనున్న పాదయాత్ర.
* గుంటూరు: ఈనెల 5న బుర్రిపాలెంలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ విగ్రహ ఆవిష్కరణ..
* విజయవాడ: కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ.. కంపార్టుమెంట్లలో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం, నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,601 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,396 మంది భక్తులు, హుండీ ఆదాయం రూ.5.21 కోట్లు
* అనంతపురం : కళ్యాణదుర్గం పట్టణంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగే సమావేశంలో పాల్గొననున్న మంత్రి ఉషశ్రీ చరణ్
* శ్రీ సత్యసాయి : ధర్మవరం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడోత్సవం.