అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు. సీఎం అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ సమావేశం. మధ్యాహ్నం కొన్ని శాఖలపై సీఎం చంద్రబాబు సమీక్ష.
అమరావతి: నేడు ఉదయం 11 గంటలకు జగన్ మీడియా సమావేశం. అక్రమ కేసులు, సూపర్ సిక్స్ హామీల వైఫల్యాలపై మాట్లాడనున్న జగన్. ఇవాళ సాయంత్రం 4.20కి బెంగళూరుకు జగన్.
ఢిల్లీ: నేడు ఢిల్లీకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం 12 గంటలకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్‌తో రేవంత్ రెడ్డి భేటీ. రేవంత్‌తో పాటు భేటీలో పాల్గొననున్న మంత్రి ఉత్తమ్, ఉన్నతాధికారులు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టుపై మరోసారి ఫిర్యాదుతో పాటు తెలంగాణ నీటి పారుదల ప్రాజెక్టులపై కేంద్రమంత్రితో చర్చించనున్న సీఎం రేవంత్, ఉత్తమ్.
హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ ఎంపీలు ఈటల, రఘునందన్‌రావు. తమపై నమోదైప క్రిమినల్ కేసులు కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించిన ఎంపీలు. ఈటలపై కమలాపూర్‌లో, రఘునందన్‌రావుపై దుబ్బాక పీఎస్‌లో గతంలో కేసులు. ఇవాళ విచారించనున్న హైకోర్టు.
తెలుగు రాష్ట్రాల్లో నేడు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,510 లుగా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,920 లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.1,21,100 లుగా ఉంది.
నేడు యాదాద్రి జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన. కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న పొంగులేటి.
ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు. అర్మేనియా నుంచి భారత్ చేరుకున్న తొలి విమానం. ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న 110 మంది భారతీయులు. ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులను వెనక్కి తీసుకొస్తున్న కేంద్రం. ఇరాన్ నుంచి స్వదేశానికి రావడం సంతోషంగా ఉంది.
ఏపీ లిక్కర్ స్కాం నిందితుల బెయిల్ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టు విచారణ. లిక్కర్ స్కాం కేసులో A1 రాజ్ కేసీరెడ్డి, A8 చాణక్య, A30 దిలీప్‌ల బెయిల్ పిటిషన్లపై నేడు విచారణ చేయనున్న ఏసీబీ కోర్టు.
రెండోరోజు ఢిల్లీ పర్యటనలో ఏపీ మంత్రి నారా లోకేష్.. నేడు కేంద్రమంత్రి మాండవియాతో భేటీ కానున్న లోకేష్.. యూకే మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో సమావేశం కానున్న లోకేష్