నేడు ఏపీలో ప్రధాని మోడీ పర్యటన. చిలకలూరిపేట బహిరంగ సభలో పాల్గొననున్న మోడీ. బీజేపీ- టీడీపీ- జనసేన పొత్తు తర్వాత తొలి సభ. ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకోనున్న మోడీ.
నేడు తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,100 లుగా ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 60,590లుగా ఉంది. అలాగే కిలో వెండి ధర రూ.80,300 లుగా ఉంది.
నేటి నుంచి ఏడు రోజుల పాటు ప్రణీత్రావును విచారించనున్న పోలీసులు.
యాదాద్రిలో ఏడో రోజు వైభవంగా బ్రహ్మోత్సవాలు. నేడు జగన్మోహ్ఇని అలంకార సేవలో శ్రీనృసింహుడు. రాత్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఎదుర్కోలు ఉత్సవం.
నేడు డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్. ఫైనల్లో తలపడనున్న ఢిల్లీ, బెంగళూరు. రాత్రి 7.30 గంటలకి మ్యాచ్ ప్రారంభం.
నేడు ఢిల్లీకి కేటీఆర్, హరీష్రావు. కవితను కలవనున్న కేటీఆర్, హరీష్ రావు. కేటీఆర్, హరీష్ రావు వెంట వెళ్లనున్న ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డి, జాన్సన్ నాయక్.
నెల్లూరు లో ఆర్యవైశ్య ఆత్మీయ సమావేశం. ముఖ్యఅతిథిగా పాల్గొన్న నెల్లూరు వై.సి.పి లోక్ సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి. నెల్లూరు ఎం.పి. ఆదాల ప్రభాకర్ రెడ్డి కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ నేతల సమావేశం.
నేడు ఏపీలో గ్రూప్-1 పరీక్ష. పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు. మొదటి పరీక్ష ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 వరకు. రెండో పేపర్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4 వరకు. పరీక్షా కేంద్రాలలోనికి గంట ముందు నుంచి అనుమతిస్తారు. పరీక్షా ప్రారంభానికి 15 నిముషాలు ముందు నుంచి అభ్యర్ధులను కేంద్రం లోకి అనుమతించడం జరుగదు.
ఇవాళ ఉదయం 10.30 బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి రేవంత్ మీట్ ది ప్రెస్. మధ్యాహ్నం మహారాష్ట్ర వెళ్లనున్న సీఎం. భారత్ న్యాయ్ యాత్ర ముగింపు సభలో పాల్గొననున్న సీఎం రేవంత్.
నేడు రాత్రికి హైదరాబాద్ కి ప్రధాని మోడీ. రాత్రి రాజ్ భవన్ లో బస. ఎల్లుండి జగిత్యాల లో బీజేపీ విజయ సంకల్ప సభ. ఎల్లుండి ఉదయం 10 గంటల 10 నిమిషాలకి బేగం పెట్ ఎయిర్పోర్ట్. 11.20 కి జగిత్యాల చేరుకుంటారు. 11.30 నుండి 12.20 వరకు బహిరంగ సభ పాల్గొని ప్రసంగిస్తారు. 1.30 కి బేగం పేట ఎయిర్పోర్ట్కు చేరుకొని.. అక్కడి నుండి కర్ణాటక శివమొగ్గ వెళ్లనున్నారు మోడీ.