ఈ ఆగస్టు14న మల్టీస్టారర్ మూవీస్ కూలీ, వార్2 చిత్రాలు బాక్సాఫీస్ వార్‌కు దిగాయి. రెండూ మిక్స్డ్ రివ్యూస్ తెచ్చుకున్నా.. సీనియర్ హీరోలకు పట్టం కట్టారు సౌత్ అండ్ నార్త్ ఆడియన్స్. కానీ ఈ టూ బిగ్ బడ్జెట్ చిత్రాలతో పోటీ పడిన మరో టాలీవుడ్ ఇండస్ట్రీ.. అదేనండీ బెంగాలీ మూవీ ధూమకేతు రిజల్ట్ ఏంటీ..? బొమ్మ హిట్టైందా అంటే యస్.. మామూలు హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్. ఈ ఏడాది బెంగాల్ హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది ధూమకేతు. కూలీ, వార్2ని కాదని బెంగాల్ ఆడియన్స్ ప్రాంతీయ భాషా చిత్రానికి పట్టం కట్టారు.
Also Read : Mirai Trailer : మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. విలన్ గా మంచు మనోజ్ అదరగొట్టాడుగా
బెంగాల్ సూపర్ స్టార్ దేవ్, శుభశ్రీ గంగూలీ జోడీ కట్టిన ధూమకేతుని జస్ట్ 4 కోట్లతో తెరకెక్కించారు. నేషనల్ విన్నింగ్ ఫిల్మ్ మేకర్ కౌశిక్ గంగూలీ దర్శకత్వంలో వచ్చిన ఈ ఫిల్మ్ 20 కోట్లను క్రాస్ చేసి బెంగాల్ హయ్యెస్ట్ గ్రాసరే కాదు.. ఆల్ టైమ్ హయ్యెస్ట్ గ్రాసర్ బెంగాల్ ఫిల్మ్‌లో ఐదవ స్థానంలో నిలిచింది. పెట్టిన పెట్టుబడికి సెంటర్ పర్సెంట్ రికవరీ ఎప్పుడో అయిపోయింది. ఈ సినిమాకు హీరో దేవ్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. దీంతో దేవ్ డబుల్ బొనాంజా కొట్టినట్లయ్యింది. ఇప్పటికీ కూడా హౌస్ ఫుల్ కలెక్షన్లతో దూసుకెళుతోంది. పదేళ్ల క్రితమే ధూమకేతు స్టారైనప్పటికీ.. ఫినీష్ చేయడానికి రెండేళ్లు పట్టింది. ఎనిమిదేళ్ల క్రితమే థియేటర్లలో సందడి చేయాల్సిన సినిమా పలు వాయిదాల కారణంగా ఇన్నాళ్లకు రిలీజ్ అయ్యింది. ఈ సినిమాకు హైప్ క్రియేట్ కావడానికి మరో రీజన్ మాజీ లవర్స్ దేవ్, శుభశ్రీ 12 ఏళ్ల తర్వాత ఆన్ స్క్రీన్ రీయూనియన్ కావడం. ధూమకేతుతో కలిసి ఈ జోడీ ఆరు సినిమాల్లో నటించింది. వీరిద్దరికీ విపరీతమైన క్రేజ్ కూడా ఈ లోకల్ సినిమాకు ప్లస్ అయ్యిందంటున్నారు బెంగాల్ క్రిటిక్స్. సినిమా ప్లాట్ కూడా మెప్పించడంతో సక్సెస్ కావడంతో.. సినిమాను హిట్ చేశారు బెంగాల్ ఆడియన్స్.