Mirai Trailer : మిరాయ్ ట్రైలర్ రిలీజ్.. విలన్ గా మంచు మనోజ్ అదరగొట్టాడుగా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైల్ట్ ఆర్టిస్టు నుండి హీరోగా మారిన తేజా సజ్జా హనుమాన్ మూవీతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాడు . జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన ఈ పాన్ ఇండియా ఫిల్మ్ రూ. 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాదించి టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్‌ను షేక్ చేసింది. అదే జోష్ లో మరో పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టాడు తేజసజ్జ. ఈగల్ ఫెమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా చేస్తున్న మూవీ మిరాయ్. అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది.
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇందులో తేజ ఓ యోధుడిగా కనిపించబోతున్నాడు. మంచు మనోజ్ యాంటోగనిస్టుగా కనిపించడం కూడా ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ చేసింది. రితికా నాయక్ హీరోయిన్. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ కు మంచి స్పందన రాగా తాజాగా మిరాయ్ ట్రైలర్ ను చేసారు మేకర్స్. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు విజువల్ ఫీస్ట్ అందించిందనే చెప్పాలి. హీరోగా తేజ సజ్జా ఆకట్టుకున్నాడు. ఇక విలన్ గా మంచు మనోజ్ అయితే అదరగొట్టాడు. డీవోపీ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని టేకింగ్ మేకింగ్ అదిరిపోయింది. చూస్తుంటే పాన్ ఇండియా స్థాయిలో మిరాయ్ గట్టిగా సౌండ్ చేసేలా ఉంది. ఇక ట్రైలర్ చివర్లో వచ్చిన రాముడి షాట్ ట్రైలర్ కె హైలెట్ అని చెప్పొచ్చు. జగపతి బాబు, శ్రేయ కూడా కీ రోల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 12న పాన్ ఇండియా భాషలలో మిరాయ్ రిలీజ్ కాబోతుంది.
తాజావార్తలు
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
-
Thackeray Brothers: CJP ఆందోళనకు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేల మద్దతు.!
-
Balochistan: పాక్ సైనికులపై BLA మహిళా యూనిట్ దాడి.. 9 మంది హతం..
-
Virat Kohli Hundred Centuries: విరాట్ కోహ్లీ 100 శతకాలు సాధిస్తాడా.. ఇదిగో సాధ్యసాధ్యాలు..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!