* నేడు ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కో-ఆర్డినేటర్ మిథున్ రెడ్డి రాజమండ్రిలో పర్యటన.. ఉదయం 9 గంటలకు హోటల్ షెల్టన్‌లో మీడియా సమావేశం.. అనంతరం వైసీపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జిల్లా నేతలతో మిథున్ రెడ్డి సమీక్ష సమావేశం
* నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్న వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి.. నరుకుల్ల పాడు, అమరావతి, పొందుగుల, జూపూడి, అత్తలూరు గ్రామాల్లో పర్యటించనున్న మంత్రి
* నేడు ప్రత్తిపాడు నియోజకవర్గంలో కాకుమానులో గ్రామపంచాయతీ మంచినీటి చెరువుకు భూమిపూజ చేయనున్న ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, జిల్లా కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేకతోటి సుచరిత
* కడప: నేడు జిల్లాలో మూడో రోజు సీఎం జగన్ పర్యటన.. కడపలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న సీఎం
* ఏలూరు: మధ్యాహ్నం 12 గంటలకు, సాయంత్రం ఐదు గంటలకు పార్టీ ముఖ్య నేతలు, వీర మహిళలతో సమావేశం నిర్వహించనున్న జనసేనాధినేత పవన్ కళ్యాణ్
* విశాఖ: నేడు అంగన్‌వాడి కార్మికుల మహాధర్మా.. జీవీఎంసీ గాంధీ చౌక దగ్గర 36 గంటల నిరసన తెలపనున్న అంగన్వాడీలు
* ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ.. లిక్కర్ కేసులో తనకు ఈడీ ఇచ్చిన సమన్లు రద్దు చేయాలని, సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత.. తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరిన కవిత.. ఈ కేసును విచారణ జరపనున్న జస్టిస్ సంజయ్ కృష్ణ, జస్టిస్ సుదాన్ష్‌ల ధర్మాసనం
* సికింద్రాబాద్: నేడు ఉజ్జయిని అమ్మవారి రంగం కార్యక్రమం
* నేడు రెండో రోజు తెలంగాణలో సునీల్ బన్సల్ పర్యటన.. పదాధికారులు, ముఖ్యనేతలతో బన్సన్ భేటీ