ఇండియాలో పాశ్చాత్య సంస్కృతి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే.. పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ఇక్కడికి కూడా పాకుతోంది. సెలెబ్రిటీలు, డబ్బున్న బడాబాబులు.. అక్కడే చదువుకోవటమో, లేదా తీరిక సమయాల్లో అక్కడికి వెళ్లి తనివితీరా ఎంజాయ్ చేసి వస్తుండటమో జరుగుతోంది. రేవ్ పార్టీ.. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా ఎక్కువగా వినిపిస్తున్న మాట. రెండ్రోలజు కింద బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఎక్కువ మంది తెలుగు వాళ్లే ఉన్నారని.. అందులోనూ రాజకీయ, సినీ ప్రముఖులు ఉన్నారని ప్రచారం సాగుతోంది. రేవ్ పార్టీలు అంటే కొంత మందికి తెలిసినా.. తెలియని వారు అధికంగా ఉన్నారు. అసలు రేవ్ పార్టీ అంటే ఏమిటి? ఇందులో కేవలం సెలెబ్రెటీలే ఎందుకు పాల్గొంటారు..? అసలు ఆ పార్టీలో ఎలాంటి పనులు చేస్తారు..? వీటికి యువత ఎందుకు అంతగా అలవాటు పడుతున్నారన్నది తెలుసుకుందాం.
READ MORE: Fancy Registration Number: ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబరు కోసం ఏకంగా రూ. 25 లక్షలు.. హైదరాబాద్ లోనే..
రేవ్ పార్టీ కల్చర్ అనేది 1950లో ఇంగ్లండ్‌లో మొదలై.. మెల్లిగా ప్రపంచమంతా వ్యాపించింది. ఈ కల్చర్ ప్రారంభమైన కొత్తల్లో.. క్లోజ్డ్ ఏరియాలో పెద్దగా మ్యూజిక్ పెట్టుకోనో, లేదా లైవ్ పర్‌ఫార్మెన్స్ ఇవ్వటమే.. దానికి మైమరిచిపోతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేయటం ఉండేది. ఇక.. పాశ్చత్య దేశాల్లో సాధారణంగానే మద్యం సేవించే అలవాటు ఉండటంతో.. అది కూడా కంటిన్యూ అయ్యేది. కాగా.. రాను రానూ ఈ పార్టీకి అర్థం మారుతూ వస్తోంది. వైల్డ్ బిహేవియర్‌తో చేసుకునే పార్టీలకు రేవ్ పార్టీలు అని పిలవడం మొదలుపెట్టారు. క్రమక్రమంగా ఈ రేవ్ పార్టీ కల్చర్.. చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వేదికవ్వటం ప్రారంభమైంది. రేవ్ పార్టీలు చాలా గోప్యంగా సాగుతున్నాయి. దానికి కారణం.. ఈ పార్టీల్లో సెలెబ్రిటీలు, ప్రముఖుల పిల్లలు మాత్రమే పాల్గొనటం ఒక ఎత్తయితే.. ఈ పార్టీల్లో మద్యంతో పాటు డ్రగ్స్, అమ్మాయిలు ఇలా.. చాలానే యవ్వారం జరుగుతుందని టాక్. ముఖ్యంగా యువత ఈ పార్టీల్లో విచ్చలవిడిగా డ్రగ్స్ సేవిస్తూ.. అశ్లీల నృత్యాలు చేయటం.. అదీ హద్దు మీరి శృంగార కార్యకలాపాలు జరుగుతాయని.. అన్నింటికీ అన్ని రకాలుగా రెడీ అయిన వాళ్లే ఈ పార్టీల్లో పాల్గొంటారని సమాచారం.