హైదరాబాద్ లో జరిగిన వేలంలో ఒక కారు యజమాని తన వాహనం కోసం ‘9999’ యొక్క ఫాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ పొందడానికి రూ. 25.5 లక్షలు చెల్లించినట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా అథారిటీ అధికారులు ఈ రోజు తెలిపారు. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సి రమేష్ మాట్లాడుతూ., ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నంబర్ల కోసం ఆన్లైన్ వేలంలో.. ‘9999’ అత్యధిక బిడ్ మొత్తానికి అమ్ముడబోయింది. ఇందులో కారు యజమాని తన హై-ఎండ్ వాహనం కోసం TG – 09 9999 నంబర్ ప్లేట్ కోసం రూ. 25,50,002 ను చెల్లించారు.
Shane Watson: ఆర్సిబి అభిమానులకు క్షమాపణలు చెప్పిన షేన్ వాట్సన్.. ‘నా వల్లే అంతా’ అంటూ..
సోమవారం జరిగిన ఫ్యాన్సీ నంబర్ ‘9999’ వేలంలో 11 మంది పాల్గొన్నారు. దాంతో ఈ సంఖ్య రూ. 25.5 లక్షలు పలికింది. ఇప్పటి వరకు ఇది ఫ్యాన్సీ నంబర్కు అత్యధిక బిడ్ మొత్తం, ఇది తెలంగాణలో రికార్డు అని అధికారి ప్రెస్ కు చెప్పారు. అంతకుముందు గత ఏడాది ఆగస్టులో ‘9999’ నంబర్ 21.6 లక్షలు వసూలు చేసింది. ఫ్యాన్సీ నంబర్స్ పై ఆసక్తి ఉన్న ఎవరైనా 50,000 రూపాయలు చెల్లించి దానిని రిజర్వ్ చేసుకోవచ్చని., ఎక్కువ మంది బిడ్డర్లు ఉంటే బిడ్డింగ్ లో పాల్గొనవచ్చని అధికారులు తెలిపారు.
SRH vs KKR: తడబడిన సన్ రైజర్స్.. 159 పరుగులకు ఆలౌట్
ఖైరతాబాద్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (ఆర్టిఎ) కార్యాలయం సోమవారం ఇతర ఫాన్సీ నంబర్ల వేలం సమయంలో రూ. 43 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది మార్చిలో వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ ను టిఎస్ నుండి టిజి గా మార్చింది.