Site icon NTV Telugu

Jammu Kashmir: బోల్తా పడిన యాపిల్‌ లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..!

Apple Lorry

Apple Lorry

ఏదైనా వస్తువులతో వెళ్తున్న లారీ.. రోడ్డుపై బోల్తా పడిందంటే ఏం చేస్తారు. దగ్గరలోని స్థానికులు వచ్చి అందులోని వస్తువులను లూఠీ చేస్తారు. మనం ఇంతకుముందు చాలా ఘటనలు చూసి ఉంటాం. టమాటా, బీర్లు, బిస్కెట్స్, ఎగ్స్, కూరగాయాలు ఇలా ఏ వస్తువులైనా.. వాటిని తీసుకెళ్తున్న ట్రక్కులు, లారీలు బోల్తా పడ్డాయంటే స్థానికులు క్షణాల్లో లూఠీ చేసేస్తారు. కానీ తాజాగా జమ్మూ కశ్మీర్ లో ఏం జరిగిందంటే.. శ్రీనగర్ హైవేపై ఓ యాపిల్స్ లారీ వెళ్తుండగా.. రాంబన్‌లోని నాచల్నా ప్రాంతంలో బోల్తా పడింది. దీంతో ఈ సంఘటనను చూసిన రోడ్డుపై వెళ్తున్న ట్రక్కు, లారీ డ్రైవర్లు, ప్రయాణికులు, ట్రాఫిక్ పోలీసులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. యాపిల్ బాక్సులన్నీ సురక్షితంగా బయటకు తీసి.. మంచి మనసును చాటుకున్నారు.

Read Also: Terrorist Arrest: ఢిల్లీలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అరెస్ట్.. ఐసిస్ మాడ్యూల్తో సంబంధాలు

ఆ తర్వాత.. ట్రాఫిక్ పోలీసులు ఆ రహదారిని మొత్తం క్లియర్ చేశారు. రోడ్డు ప్రమాదానికి గురైన ట్రక్కులో రూ. 25 నుంచి 30 లక్షల యాపిల్స్ ఉన్నాయి. ఇవన్నీ లూఠీ కాకుండా సురక్షితంగా ఓ పక్కన పెట్టేశారు. దీంతో ఆపిల్ వ్యాపారికి లక్షల ఆస్తి నష్టం తప్పింది. ఈ సహాయంపై వ్యాపారి వారందరికీ ధన్యవాదాలు చెప్పాడు. ఇదిలా ఉంటే.. రాంబన్ జిల్లా కమీషనర్ మస్రత్ జియా స్వయంగా ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వారందరిని ప్రశంసిస్తున్నారు. ఇదిలా ఉంటే.. జమ్మూ కాశ్మీర్ ట్రాఫిక్ పోలీసులు కూడా తన హ్యాండిల్‌లో ఈ సంఘటన యొక్క వీడియోను విడుదల చేసారు. దేశంలో జరిగే ఇలాంటి సంఘటనల్లో సహాయ పడాలని.. వస్తువులను లూఠీ చేయొద్దని పోలీసులు చెబుతున్నారు.

Read Also: World Costly Nail Polish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే..ప్రత్యేకత ఏంటంటే?

Exit mobile version