World Costly Nail Polish : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్ ఇదే..ప్రత్యేకత ఏంటంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆడవాళ్లు అందానికి మెరుగులు దిద్దుకుంటారు.. అందులో భాగంగా గోర్ల అందాన్ని మెరుగు పరిచేలా రంగు రంగుల నెయిల్ పాలిష్ లను వాడుతుంటారు.. ఆ నెయిల్ ధర మహా అయితే వందవరకు ఉంటుంది.. లేదా మరీ ఎక్కువ అనుకుంటే వెయ్యి వరకు ఉంటుంది.. అంతకి మించి ధర ఉండటం మనం ఎప్పుడూ విని ఉండరు.. అలాంటిది నెయిల్ పాలిష్ ధర కోటి రూపాయలు అంటే బహుషా విని ఉండరు.. కానీ కోటికి పైగా ధర ఉండే నెయిల్ పాలిష్ కూడా ఉంది.. ఆ నెయిల్ పాలిష్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్‌ను అజాచూర్ అంటారు.. ఈ నెయిల్ పాలిష్ ను లాస్ ఏంజెల్స్‌కు చెందిన డిజైనర్ అజాచూర్ పోగోసియన్ రూపొందించారు. వారు తమ లగ్జరీ వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా బాగా ప్రాచుర్యం పొందారు.. ఇకపోతే ఈ నెయిల్ పాలిష్ ను చూడటానికి దూరంగా చూస్తే మాములుగానే ఉంటుంది.. కానీ దగ్గరగా చూస్తే దీని లోని నల్లని వజ్రాలు కనిపిస్తాయి.. 267 క్యారెట్ల నల్లటి వజ్రం కనిపిస్తుంది. ఇది 14.7 మిల్లీలీటర్ రిట్జీ డిజైన్‌ను కలిగి ఉంది. దీని ధర రూ.1,59,83,750. అంటే ఒక్కో దానికి 1 కోటి కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది.. అంటే ఒక చిన్న బాటిల్ నెయిల్ పాలిష్ ధర కోటికి పై మాటే..
Also Read
ఇది చాలా అరుదైన నెయిల్ పాలిష్ ఇందులో మొత్తం 1,118 వజ్రాలను కలిగి ఉన్న డైమండ్-పొదిగిన టోపీతో ఒక సీసాలో వస్తుంది. కానీ ఇది అందరికీ అందుబాటులో ఉండదు. కాబట్టి, ఇది అత్యంత ఖరీదైన నెయిల్ పాలిష్.. ప్రతి బాటిల్ నెయిల్ పాలిష్ లో ఒక నల్లని వజ్రం ఉంటుంది.. కాంతివంతమైన నెయిల్ పాలిష్‌తో పాటు, 60 హ్యాండ్‌సెట్ బ్లాక్ డైమండ్స్‌తో ఫిల్ చేయబడిన హ్యాండ్‌మేడ్ ప్లాటినం స్టెర్లింగ్ క్యాప్ బాటిల్ లో సేల్ చేస్తారు.. ఈ నెయిల్ పాలిష్ ను 2012లో తయారు చేశారు.. ఈ నెయిల్ పాలిష్ చాలా ఖరీదైనది. కాబట్టి ఎవరూ కొనలేరు అని మీరు అనుకుంటే మీరు పొరపడినట్టే.. డబ్బులు ఉన్నోళ్లకు అందరిలో కంటే ప్రత్యేకంగా కనిపించాలని అనుకుంటారు.. అలాంటి వారు ఈ నెయిల్ పాలిష్ ను కొనుగోలు చేస్తారు.. ఇప్పటివరకు దీన్ని 25 మంది కొనుగోలు చేసినట్లు సమాచారం..

- Tags
తాజావార్తలు
-
Saudi: సౌదీలో రెడ్ అలర్ట్.. బంకర్లోకి వెళ్లిపోయిన యువరాజు
-
Tilak Varma: అంత నిర్లక్షమా.. బీచ్‌లో వాకింగ్ చేస్తున్నావా ఏంటి?.. తెలుగు ఆటగాడిపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
Papikondalu Boating: 70 రోజుల విరామం.. నేటి నుంచి పాపికొండలు విహారయాత్ర!
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!
-
Breaking Bad Actor: ‘బ్రేకింగ్ బ్యాడ్’ నటుడు ఆర్జే మిట్టే హఠాన్మరణం
ట్రెండింగ్
-
7 రోజుల బ్యాటరీ, ECG, GPSతో Google Fitbit Edge లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Rishabh Pant Ruled Out: రిషబ్ పంత్ అవుట్.. కీలక ప్లేయర్ ఇన్.!
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!