జ్ఞాపకశక్తి, వయసుపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్ర స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన దేశ అధ్యక్షుడిగా ఉండటం తీవ్ర ఇబ్బందికరమని పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే తన అభిప్రాయం వ్యక్తం చేశారు. పదవి నుంచి తొలగించేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు లేఖ రాసుకొచ్చారు.
Read Also: Jai Hanuman : జై హనుమాన్ హీరోగా కెజిఎఫ్ యష్?.. డైరెక్టర్ ప్లాన్ మాములుగా లేదుగా..
అయితే, ఇటీవల జరిగిన సమావేశాల్లో దేశాల పేర్ల విషయంలో జో బైడెన్ గందరగోళానికి గురికావడాన్ని మోరిసే గుర్తు చేశారు. బైడెన్ జ్ఞాపక శక్తిలో మార్పును అమెరికన్లు చాలా కాలంగా గమనిస్తునే ఉన్నారు.. బహిరంగ సభల్లో, విదేశీ నేతలతో సమావేశాల సమయంలోనూ ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. అధ్యక్షుడిగా కొనసాగడానికి ఆయన అర్హులుకారు.. సీనియర్ నేతలు సైతం బైడెన్ వయసుపై విమర్శలు చేస్తున్నారు.. 25వ సవరణను అమలు చేసి.. జో బైడెన్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించాలన్నారు. అగ్రరాజ్యం అమెరికాకు మానసికంగా దృఢంగా ఉన్న అధ్యక్షుడు అవసరం అని లేఖలో పేర్కొన్నారు.
Read Also: Farmers Protest: మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగం.. 60 మంది రైతులకు గాయాలు!
కాగా, మాజీ అధ్యక్షుడు కెనడీ హత్య తర్వాత 1965లో కాంగ్రెస్ 25వ సవరణకు ఆమోదించింది. దీని ప్రకారం అధ్యక్షుడు శారీరంగా, మానసికంగా ఫిట్‌గా లేకపోతే వైస్ ప్రెసిడెంట్, కేబినెట్ సభ్యులు భావిస్తే.. ఆయనను పదవి నుంచి తొలగించే అధికారం ఉంటుందని అనే విషయాన్ని పశ్చిమ వర్జీనియా అటార్నీ జనరల్ పాట్రిక్ మోరిసే గుర్తు చేశారు. వయసురీత్యా వచ్చే ఇబ్బందుల వల్ల జో బైడెన్ జ్ఞాపకశక్తిలో అనేక లోపాలను గుర్తించినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది.