WI vs IND Day 2 Highlights: రోహిత్, జైస్వాల్ సెంచరీలు.. భారీ ఆధిక్యం దిశగా భారత్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
West Indies vs India 1st Test Day 2 Highlights: వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతోంది. అరంగేట్ర ప్లేయర్ యశస్వి జైస్వాల్ (143 బ్యాటింగ్; 350 బంతుల్లో 14 ఫోర్లు), కెప్టెన్ రోహిత్ శర్మ (103; 221 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీలతో టీమిండియా పట్టుబిగించింది. రెండో రోజైన గురువారం ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది. ప్రస్తుతం భారత్ 162 పరుగుల ఆధిక్యంలో ఉంది. యశస్వి జైస్వాల్ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (36) క్రీజులో ఉన్నాడు.
ఓవర్ నైట్ స్కోర్ 80/0తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్ తొలి సెషన్లో వేగంగా పరుగులు చేయలేదు. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఆచితూచి బ్యాటింగ్ చేశారు. వెస్టిండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో.. ఎక్కువగా డిఫెన్స్ ఆడారు. సింగిల్స్‌తో స్ట్రెక్‌రోటేట్ చేస్తూ వెళ్లారు. ఈ క్రమంలోనే జైస్వాల్ 104 బంతుల్లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆపై రోహిత్ ఓ సిక్స్, ఫోర్ బాది హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. లంచ్ విరామ సమయానికి భారత్ 146/0తో నిలిచింది.
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
లంచ్ తర్వాత రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ కాస్త దూకుడు పెంచారు. జైస్వాల్ ధాటిగా ఆడి 215 బంతుల్లో సెంచరీ చేశాడు. రోహిత్ 220 బంతుల్లో శతకం బాదాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాతి బంతికే రోహిత్ ఔట్ కాగా.. క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్ (6) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. టీ బ్రేక్ సమయానికి భారత్ 245/2తో నిలిచింది. తర్వాత క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి యశస్వి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ సింగిల్స్ తీస్తూ జట్టు స్కోరు 300 దాటించారు. రెండో రోజు ముగిసేసరికి భారత్ 312 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్ 150 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
Also Read: Gold Price Today: మహిళలకు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
Also Read: Mahalaxmi Stotram: భక్తిశ్రద్ధలతో ఈ స్తోత్రాలు వింటే దారిద్య్రానికి చోటు ఉండదు
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?