వెస్టిండీస్ క్రికెట్ జట్టు ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు ఆతిథ్యం ఇస్తోంది. కింగ్‌స్టన్‌లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో ఈరోజు రెండో రోజు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ బౌలర్ చరిత్ర సృష్టించాడు. వెస్టిండీస్ బౌలర్ జాడెన్ సీల్స్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బంగ్లాదేశ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 164 పరుగులకు ఆలౌట్ చేయడంలో సీల్స్ కీలక పాత్ర పోషించాడు. అతను 15.5 ఓవర్లు బౌలింగ్ చేయగా.. అందులో 10 మెయిడిన్ ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీశాడు. కేవలం ఐదు పరుగులు మాత్రమే ఇచ్చాడు. టెస్టుల్లో ఈ తరహా ఎకానమీ సాధించడం అద్భుతం.
Read Also: Renuka Chowdhury: ఎక్కువ మంది పిల్లల్ని కనాలన్న మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఆగ్రహం
సీల్స్ ఎకానమీ 0.30గా ఉంది. ఇది టెస్ట్ క్రికెట్ చరిత్రలో రెండవ అత్యుత్తమ ఎకానమీ. ఆ జాబితాలో మొదటి పేరు ఇండియా ప్లేయర్ బాపు నందకర్ణి ఉన్నాడు. బాపు 1964లో ఇంగ్లండ్‌పై 32 ఓవర్లలో 27 మెయిడిన్లు వేసి ఐదు పరుగులు ఇచ్చాడు. ఆ సమయంలో అతని ఎకానమీ 0.15గా ఉంది. తాజాగా.. సీల్స్ చేరాడు. ఇతని తర్వాత ఇంగ్లండ్‌కు చెందిన జిమ్ లేకర్, ఆస్ట్రేలియాకు చెందిన జిమ్ బర్క్, నాథన్ లియాన్.. ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ అలెన్, ఇండియాకు చెందిన ఉమేష్ యాదవ్, మనీందర్ సింగ్.. పేర్లు ఉన్నాయి.
Read Also: Nepal Bowler Yuvraj Khatri: అత్యుత్సాహం చూపిస్తే రిజల్ట్ ఇలాగే ఉంటుంది కాబోలు..
సీల్స్‌తో పాటు షమర్ జోసెఫ్ 3 వికెట్లు తీశాడు. కెమర్ కోచ్‌కి రెండు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ తరఫున షాద్‌మన్ ఇస్లామ్ అత్యధికంగా 64 పరుగులు చేశాడు. మెహీద్ హసన్ మిరాజ్ 36 రన్స్ చేశాడు. షాదత్ హుస్సేన్ 22, తైజుల్ ఇస్లాం 16 పరుగులు చేశారు. ఈ క్రమంలో.. వెస్టిండీస్ తన తొలి ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు ఒక వికెట్ కోల్పోయి 70 పరుగులు చేసింది. కెప్టెన్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ 33, కేసీ కార్తీ 19 పరుగులతో క్రీజులో ఉన్నారు.