Family Suicide: పశ్చిమ బెంగాల్‌లో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. ఆదివారం నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని ఖర్దా ప్రాంతంలో కుళ్లి పోయిన స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యుల మృతదేహాలను వారి స్వంత ఫ్లాట్ నుండి స్వాధీనం చేసుకున్నారు. తన భార్య అక్రమ సంబంధం పెట్టుకుందని, అది తట్టుకోలేకే ఈ దారుణానికి పాల్పడినట్లు ఆ వ్యక్తి రాసిన సూసైడ్ నోట్‌ను కూడా పోలీసులు ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఫోరెన్సిక్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించి నమూనాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు.
మృతులను వస్త్ర వ్యాపారి బృందాబన్ కర్మాకర్ (52), అతని భార్య దేబాశ్రీ కర్మాకర్(40), వారి 17 ఏళ్ల కుమార్తె డెబ్లీనా, ఎనిమిదేళ్ల కుమారుడు ఉత్సాహాగా గుర్తించారు. అందరి మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో కనిపించడంతో.. వారు నాలుగు-ఐదు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటారన్న ఊహాగానాలు వస్తున్నాయి.
Read Also:Tirupati: తిరుపతి లో షాకింగ్ ఘటన.. పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బరాక్‌పూర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఖర్దా ప్రాంతంలో ఎం.ఎస్. ముఖర్జీ రోడ్డులోని మూసి ఉన్న అపార్ట్‌మెంట్‌లో మృతదేహాలు లభ్యమయ్యాయి. దుర్వాసన రావడంతో స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి విచారణకు తరలించారు. ఈ కేసులో బృందాబన్ కర్మాకర్ తన కుటుంబ సభ్యులకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్లాట్‌లోని వేర్వేరు ప్రదేశాల్లో మరో మూడు మృతదేహాలు పడి ఉండగా, వ్యక్తి మృతదేహం పైకప్పుకు వేలాడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
మృతుల మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నామని, వాటిపై విచారణ జరుపుతామన్నారు. భార్యాభర్తల మొబైల్ ఫోన్ల రికార్డులను సేకరిస్తున్నారు. మిగిలిన వారి కుటుంబ సభ్యులను కూడా సంప్రదించారు. ఈ ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా సంచలనం రేపింది. పోస్టుమార్టం తర్వాత ఎవరు ఎలా చనిపోయారో తెలియనుంది.
Read Also:World Cup 2023 Awards: ప్రపంచకప్ 2023లో అవార్డులు అందుకున్న ప్లేయర్స్ వీరే.. టీమిండియాకు ఆరు!