ఈ మధ్య కాలంలో బరువు తగ్గడానికి చాలా మంది నానా తంటాలు పడుతున్నారు. ఇలా చేస్తే బరువు తగ్గుతాం.. అలా చేస్తే బరువు తగ్గుతాం అంటూ రకరకాల డైట్స్ ఫాలో అవుతూ ఉంటారు. మనలో చాలా మందికి కాఫీ, టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగుతూ కూడా మనం బరువు తగ్గవచ్చు. కాఫీలో టర్ కాఫీ, బుల్లెట్ ప్రూఫ్ కాఫీలు, బ్రకోలీ కాఫీలు ఉంటాయి. ఇవి హెల్దీ వెయిట్‌లాస్ డ్రింక్ లో ఒకటిగా ఉంటాయి. బ్రకోలీ కాఫీ తీసుకోవడం వల్ల త్వరగా బరువు కూడా తగ్గుతారు.
దీని కోసం బ్రకోలీ పౌడర్ చాలా అవసరం. కప్పు పాలని బాగా మరిగించి అందులో కాఫీ పౌడర్, బ్రకోలీ పౌడర్ వేయండి. ఆ డ్రింక్ తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఈ బ్రకోలి పౌడర్ మనకు షాపుల్లో దొరుకుంది. లేదంటే ఇంట్లోనే బ్రోకలీని చిన్న ముక్కులుగా తరిగి ఎండలో ఎండబెట్టి పౌడర్ గా చేసుకోవచ్చు. బ్రకోలీలో ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులో పీచుపదార్థం శరీరంలోని కొవ్వుని కరిగించి బరువును కంట్రోల్‌లో చేయడంలో ఉపయోగపడుతుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. కేలరీలు తక్కువ ఉంటాయి.
బ్రోకలీలో కాల్ఫిషయం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలు బలంగా ఉండటానికి పనిచేస్తుంది. దీనిలో ఇందులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా షుగర్ స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది.ఇది గుండె జబ్బులు, క్యాన్సర్ నుంచి కూడా కాపాడుతుంది. తిన్న చాలాసేపటి వరకూ కడుపు నిండిన ఫీలింగ్‌ని ఇస్తుంది. ఇందులోని సూక్ష్మ పోషకాలు బాడీలోని అనవసరమైన చెడు కొవ్వులని విచ్చిన్నం చేయడం ద్వారా బరువు తగ్గడంలో ఉపయోగపడతాయి. బ్రకోలీ పొడిని ఇలా 2 టేబుల్ స్పూన్లు బ్రకోలీ పౌడర్ తీసుకుంటే అరకప్పు పచ్చి బ్రకోలీ తినడంతో సమానం. కాబట్టి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు ఇలా ట్రై చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.