MS DHONI: అభిమానానికి హద్దులు లేదంటే ఇదేనేమో.. వెడ్డింగ్ కార్డుపై ఎంఎస్ ధోని ఫోటో..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా మాజీ సారథి, సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులున్నారు. వారిలో ఒక వీరాభిమాని తన పెళ్లికార్డులో ధోనీ ఫోటో వేసుకున్నాడు. అమితమైన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ వెడ్డింగ్ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Devara: మళ్లీ యుద్ధం మొదలు పెట్టనున్న టైగర్…
Also Read
- Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
- స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
- Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
- ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
మహేంద్ర సింగ్ ధోనీకి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. అసాధారణమైన వికెట్ కీపింగ్ నైపుణ్యంతో పాటు ఎప్పుడూ మిస్టర్ కూల్‌గా ఆరాధించబడుతూ ధోనీ అభిమానుల మనసు కొల్లగొట్టాడు. అయితే ఎంఎస్ ధోనీ అభిమాని ఒకరు అతనిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని రాయగఢ్ జిల్లాలోని తమ్నార్కి చెందిన దీపక్కి ధోనీ అంటే విపరీతమైన అభిమానం. ఎంతగా అంటే తన పెళ్లికార్డులో రెండువైపుల ధోనీ ఫోటోని వేయించుకున్నాడు. తలా అనే పదం వెడ్డింగ్ కార్డ్ పై కూడా రాయించుకున్నాడు.
Also Read: Hyderabad: హైదరాబాద్ లో గంటల వ్యవధిలో ఇద్దరు పిల్లల కిడ్నాప్
అయితే దీపక్కి చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ఇష్టం.. ధోనిని ఆదర్శంగా తీసుకునేవాడు. క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో తన గ్రామంలో క్రికెట్ టీమ్‌కు బాధ్యతలు స్వీకరించాడు. తన జట్టుని అనేకసార్లు గెలిపించి అందరి మన్ననలు అందుకున్నాడు. ఎంఎస్ ధోనీ వల్ల ప్రభావితమై అతనిలాగే వ్యూహాలే రచించాను అని దీపక్ అన్నాడు. ధోనీ మీద తన అభిమానం చాటుకోవడానికి తన పెళ్లి సరైన వేదిక అనుకున్నాడు.. అందుకే వెడ్డింగ్ కార్డుపై ఎంఎస్ ధోని ఫోటోను ముద్రించాడు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Katakam Sudarshan: మావోయిస్ట్ అగ్రనేత కటకం సుదర్శన్ మృతి
అతని కాబోయే భార్య గరీమాతో పెళ్లికి సంబంధించిన వివరాలతో పాటు ధోనీ ఐకానిక్ జెర్సీ నంబర్ 7.. అతని ఫోటోను తన పెళ్లి కార్డుపై వేయించుకున్నాడు. జీవితంలో ముఖ్యమైన వివాహ వేడుకల్లో తను ఎంతగానో అభిమానించే ధోనీకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడంటే దీపక్.. ధోనిపై ఎంత అభిమానం పెంచుకున్నాడో అర్ధం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
This Week OTT Releases: ఈ వారం ఓటీటీలలో అదిరిపోయే కంటెంట్ ఉన్న సినిమాలు, సిరీస్ లు ఇవే
-
Vijayashanthi: రక్షించాల్సిన వారే తప్పు చేస్తే ఎలా?.. షాబాద్ నరమేధంపై గళమెత్తిన ‘రాములమ్మ’
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్‌రూఫ్‌తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
Shabad Murder Case: షాబాద్ విషాదం.. ఒంటరిగా మిగిలిన మేఘనకు ప్రభుత్వం ఆర్థిక సాయం
-
Ram Charan : హైదరాబాద్ శివార్లలో రామ్ చరణ్ లగ్జరీ ఫామ్‌హౌస్.. త్వరలోనే గృహప్రవేశం
ట్రెండింగ్
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్‌తో ఎఫైర్!
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!