తెలంగాణలో భానుడు ప్రతాపాన్ని చూపుతున్నాడు. దీంతో.. ప్రజలు చెమటలు కక్కుతున్నారు. వాయువ్య దిశ నుంచి తెలంగాణ వైపు గాలులు వీస్తున్నాయి. దీంతో.. మంచిర్యాల, నిజామాబాద్, కోమరంభీం, నల్లగొండ జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్ర తలు నమోదవుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి. కొండాపూర్ లో 45.8 డిగ్రీలు నమోదు కాగా.. జన్నారంలో 45.8, బెల్లంపల్లిలో 45.4, నీల్వాయి 45.5, కొమ్మెర 44.9, జగిత్యాల జిల్లా జైనా లో 45.5, కోమరంభీం జిల్లా కెరమెరిలో 45.4లు, నిజామాబాద్ జిల్లా ముక్పలలో 45.1లు, నల్లగొండ జిల్లా పజ్జూరులో 45లు నమోదయ్యాయి.
Also Read : Health Tips : నిద్ర లేకుండా మనిషి ఎంతకాలం జీవించగలడు?
అయితే.. రాబోయే 3 రోజుల పాటు ఇదే తరహాలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 38 డిగ్రీ సెంటిగ్రేడ్ నుంచి 41 డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణ శాఖ. అందువల్ల నిన్నటి నుంచి ఉత్తర తెలంగాణలోని 14 జిల్లాల్లో అత్యధిక ఎండలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి, కరీంనగర్, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కొమురం భీం, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలో వేడి గాలులు ఎక్కువగా వీస్తాయని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ముఖ్యంగా బొగ్గు గనులు ఉండే జిల్లాల్లో.. భూమి నుంచి వేడి పైకి వస్తూ.. భరించలేని ఉక్కపోత ఉంటుందని తెలిపారు.
Also Read : Vande Bharat Express : శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు మరో 16 కోచ్‌లు