Site icon NTV Telugu

Weather Updates : నేడు తెలుగు రాష్ట్రాల్లో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

Visakharain

Visakharain

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) భారీ వర్ష సూచన జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. తెలంగాణ విషయానికి వస్తే, ఆదిలాబాద్‌, కొమరం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నల్గొండ, , హైదరాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.

 Peddireddy Ramachandra Reddy: మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సహా కుటుంబ సభ్యులపై కేసు

అలాగే, ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా, మన్యం జిల్లా, శ్రీకాకుళం జిల్లా , అనకాపల్లి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల కోసం సిద్ధంగా ఉండాలని, ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు.

AP Rains: ఎడతెరిపి లేని వర్షాలు.. జలదిగ్బంధంలో చిక్కుకున్న పలు కాలనీలు..

Exit mobile version