MP CM Ramesh: సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేస్తాం.. బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
- బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు
- ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చాం
- గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని సీఎంను కోరాం
- ఏపీలో జరిగిన అవినీతిపై సీబీఐ.. ఈడీలకు ఫిర్యాదు చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP CM Ramesh: ఆంధ్రప్రదేశ్ శాసన సభ సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో శాసన సభకు వచ్చిన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.. ఐదేళ్లుగా ఈ అసెంబ్లీ వైపే రాలేదు.. ఇప్పుడు అతి పెద్ద విజయంతో వచ్చామని.. గత ఐదేళ్ల కాలంలో వివిధ శాఖల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కోరామని మీడియా చిట్‌చాట్‌లో తెలిపారు.. రాష్ట్రంలో మద్యం, ఇసుక మాఫియాల మీదే కాకుండా.. చాలా శాఖల్లో అవినీతి భారీ ఎత్తున జరిగిందన్న ఆయన.. విద్యుత్ రంగంలో స్మార్ట్ మీటర్లు, పీపీఏల్లో భారీ కుంభకోణాలు జరిగాయన్నారు.. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టుల కేటాయిపుల్లోనూ అక్రమ లావాదేవీలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు.. ఇక, సాంఘీక సంక్షేమ శాఖలో కూడా అవినీతి జరిగిందన్న ఆయన.. శాఖల వారీగా అవినీతి ఎక్కడెక్కడ జరిగిందో వెలికి తీయాలన్నారు.. ఇక, గత ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన అవినీతిపై సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తామన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.
Read Also: Air India Airlines : టాటా ఎయిర్‌లైన్ కంపెనీకి మళ్లీ నోటీసు.. 15రోజుల్లో తప్పు సరిదిద్దుకోవాలని సూచన
Also Read
- Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
- Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
- Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
- 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
కాగా, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి అసెంబ్లీ సమావేశమైంది.. ఈ రోజు, రేపు.. రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించనున్నారు.. ఇక, సభలో మొదట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మంత్రులు.. ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు.. ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రమాణం చేయగా.. మిగతా సభ్యులతో అక్షర క్రమంలో ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి..
- Tags
- Andhra Pradesh
- bjp
- CBI
- cm chandrababu
- ED
తాజావార్తలు
-
Chicken Biryani: ప్రభుత్వ స్కూళ్లలో చికెన్ బిర్యానీ? సర్కార్ కొత్త ఆలోచన!
-
Allu Arjun : అల్లు అర్జున్ హిత బోధ వెనుక కారణం ఇదా?
-
Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్
-
Pawan Kalyan: జనసేన పార్టీ కీలక నిర్ణయం.. ఆ 26 మంది అవుట్!
-
Manmohan Singh: కోల్ స్కామ్ కేసులో సంచలన తీర్పు.. దివంగత మాజీ ప్రధానికి సుప్రీంకోర్టు క్లీన్ చిట్!
ట్రెండింగ్
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!