గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. రెండు సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని, భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం వల్ల ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శనివారం అన్నారు. ఇదంతా తిరిగి చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో బలమైన భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు తన నిబద్ధతను విక్రమసింఘే నొక్కి చెప్పారు. కొలంబోలో జరిగిన 31వ అఖిల భారత భాగస్వామ్య సమావేశాన్ని ఉద్దేశించి విక్రమసింఘే మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో భాగస్వామ్యానికి సంబంధించిన కీలక రంగాలను హైలైట్ చేశానని చెప్పారు. రెండు దేశాలు సంయుక్తంగా పని చేసే ముఖ్యమైన రంగాలలో పర్యావరణ అనుకూల ఇంధనం ఒకటని విక్రమసింఘే తెలిపారు. శ్రీలంక పలు ప్రతిపాదనలపై మోడీతో చర్చించినట్లు ఆయన వెల్లడించారు.
READ MORE: Chirala: ఈపూరుపాలెం యువతి హత్య కేసును 48 గంటల్లోపే ఛేదించిన పోలీసులు
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “శ్రీలంక – భారతదేశం మధ్య గ్రిడ్ ఇంటర్‌కనెక్షన్ ద్వారా పర్యావరణ అనుకూల శక్తిని భారతదేశానికి పంపవచ్చు. మాకు సాంపూర్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఉంది. ఇది అంతర్ ప్రభుత్వ ప్రాజెక్ట్. మూడు ద్వీపాల ప్రాజెక్ట్.. ఇక్కడ జూలైలో పునాది రాయి వేయాలని మేము ఆశిస్తున్నాము.” అని పేర్కొన్నారు. శ్రీలంక అధ్యక్షుడి ఈ ప్రకటన చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌కు అసంతృప్తి కలిగించవచ్చు. ఎందుకంటే అతను ఈ దేశంలో కూడా భారతదేశానికి వ్యతిరేకంగా తన స్థానాన్ని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.