గత కొన్నేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక భారత్ చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపింది. రెండు సంవత్సరాల క్లిష్టతరమైన ఆర్థిక సంక్షోభం నుంచి శ్రీలంక కోలుకున్నదని, భారతదేశం నుంచి అందుకున్న 3.5 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం వల్ల ఇది సాధ్యమైందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే శనివారం అన్నారు.