Union Railway Minister Ashwini Vaishnaw: కేకే లైన్ డబుల్ లైన్‌గా మార్చబోతున్నాం.. దీంతో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుందన్నారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. ఏపీ పర్యటనలో ఉన్న ఆయన.. విజయనగరంలో మాట్లాడుతూ.. గత తొమ్మిదేళ్ళ లో ప్రధాని నరేంద్ర మోడీ అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని.. సంక్షేమ కార్యక్రామాలు అర్హత కలిగిన ప్రతీ కుటుంబానికి అందిస్తున్నామని తెలిపారు. ఉజ్వల్ గ్యాస్ కనెక్షన్ ను అందిస్తున్నాం.. కోవిడ్ సమయంలో రెండు డోసుల వ్యాక్సిన్ వేసే ప్రక్రియ చేపట్టాం.. ఒక్కప్పుడు కొళాయి ద్వారా నీరు కావాలంటే విశాఖా లాంటి నగరాలు వెళ్లేవారు.. ఇప్పుడు ప్రతి ఇంటికీ కొళాయి అందించే విధంగా కేంద్ర చర్యలు తీసుకుందన్నారు. ఆయూష్మాన్ కార్డు ద్వారా 5 లక్ష వరకు కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని వెల్లడించారు.
Read Also: Bigg Boss Telugu 7: ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్.. ఆ ఇద్దరు అవుట్?
కొత్తవలస స్టేషన్‌ను వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ గా తీర్చు దిద్దుతామని ప్రకటించారు అశ్వినీ వైష్ణవ్.. కేకే లైన్ డౌబుల్ లైన్ గా మార్చబోతున్నాం.. దీంతో మరిన్ని రైళ్లు వచ్చే అవకాశం ఉంటుందన్న ఆయన.. కాశీకి వెళ్లే రైలు ఎస్ కోట మీదుగా వెళ్ల నుందన్నారు.. విశాఖ – బెనారస్ రైళ్లు ఫ్రీక్వెన్సీ పెంచనున్నాం అని పేర్కొన్నారు. ఇక, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఎనిమిది కోట్లు కేటాయిస్తే ప్రస్తుతం కేవలం ఏపీకే ఎనిమిది వేల కోట్లు మంజురు చేస్తున్నామని వెల్లడించారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.. మరోవైపు కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవ తప్పిదంగా తెలిపారు.. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేశారు. త్వరలో మరికొన్ని వందే భారత్ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి.. వారానికి ఒక వందే భారత్ రైలు నిర్మాణం జరుగుతోందని.. రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడవద్దు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రైల్వేల అభివృద్ధి కోసం 8 వేల 406 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. తూర్పు కోస్తా రైల్వే జోన్ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయింపే ప్రధాన సమస్య.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని భూమిని అప్పగిస్తే ఇవాళ్టి నుంచే పనులు ప్రారంభిస్తాం.. 52ఎకరాల భూమి అవసరం అవుతుందని గుర్తించాం.. డిజైన్లు, 106 కోట్ల రూపాయల నిధులు సిద్ధంగా ఉన్నాయని.. భూమి కేటాయింపు విషయంలో జాప్యం జరుగుతోంది.. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని తెలిపారు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్.