Assam Floods: అస్సాంలో వరదల పరిస్థితి కాస్త మెరుగుపడింది. బ్రహ్మపుత్ర, దాని ఉపనదుల నీటి మట్టం వివిధ ప్రాంతాలలో తగ్గిపోయింది. ఇప్పుడు ఈ నదులు ఎక్కడా ప్రమాదకర స్థాయికి మించి ప్రవహించడం లేదు. అస్సాంలో వరదల కారణంగా బార్‌పేట జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వరదల కారణంగా వందలాది మంది ప్రజలు నిరాశ్రయులైన అస్సాంలోని బార్‌పేట జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంది. బార్‌పేట జిల్లాలోని 93 గ్రామాలలో 67,000 మంది ప్రజలు ప్రభావితులయ్యారు.
#WATCH असम में बाढ़ की स्थिति बनी हुई है। बाढ़ की वजह से बारपेटा जिले के लोगों को काफी समस्याओं का सामना करना पड़ रहा है। pic.twitter.com/jSjqODW59F
— ANI_HindiNews (@AHindinews) June 28, 2023
Also Read: Heavy Rains: దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ముంబై, ఉత్తరాఖండ్, హిమాచల్‌లో హెచ్చరికలు జారీ
అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) నివేదిక ప్రకారం, బార్‌పేట జిల్లాలో ప్రస్తుతం 225 హెక్టార్ల పంట భూమి మునిగిపోయింది. జిల్లాలో గత 48 గంటల్లో వరద నీటిలో మునిగి ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 6కి చేరింది. రేపు ఈద్.. పండుగ ఉందని, వరదల కారణంగా మా ఇళ్లు దెబ్బతిన్నాయని.. ఈద్గా మైదానం కూడా నీటిలో మునిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బార్‌పేట జిల్లా శిలా గ్రామానికి చెందిన స్థానికులు చెబుతున్నారు.
#WATCH | Situation remains grim as hundreds of people are displaced due to flood situation in Barpeta district of Assam
More than 67,000 people from 93 villages in Barpeta district are affected.
According to the Assam State Disaster Management Authority (ASDMA) report, 225… pic.twitter.com/0ind18ThIT
— ANI (@ANI) June 28, 2023