వరంగల్ లో పసికందు మిస్సింగ్ ఘటన కలకం రేపుతోంది. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సోనాపొర్ గ్రామమానికి చెందిన రాజేష్ – భీమ్ బాయ్ దంపతుల బాబు వరంగల్ లో మిస్సింగ్ అయ్యాడు. ఈ నెల నాలుగవ తేదీన మంచిర్యాలలో డెలివరీ అయింది భీమ్ బాయ్. అయితే.. 7 నెలలకే బాబుకు జన్మనిచ్చింది భీమ్ బాయి. నెలలు నిండని శిశువు ఆరోగ్యంపైన వైద్యులు భరోసా ఇవ్వలేదు. దీంతో.. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌కి తీసుకెళ్లడంటూ డెలివరీ సమయంలో పరిచయం అయినా మహిళ నిర్మల చెప్పింది. మెరుగైన చికత్స కోసం రెండు రోజుల క్రితం నిర్మల సహకారంతో తల్లి బిడ్డను వరంగల్ సీకేఎం ఆస్పత్రికి తీసుకొచ్చారు భీమ్ బాయి కుటుంబ సభ్యులు. సీకేఎం ఆస్పత్రిలో భీమ్ బాయి ఫిట్స్ రావడంతో చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం కి తరలించారు. అయితే.. అదును చూసి చిన్నారిని ఎత్తుకెళ్లింది మహిళ.. శిశువు కనిపించకపోవడంతో వారితోపాటు వచ్చిన నిర్మల అనే మహిళ పైన అనుమానం వ్యక్తం చేస్తున్నారు చిన్నారి తల్లిదండ్రులు. శిశువు మిస్సింగ్ పై పోలీసులకు భీమ్ బాయి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు ఇంతేజార్ గంజ్ పోలీసులు.