తెలంగాణలో 10వ తరగతి వార్షిక హిందీ పరీక్ష పేపర్ కాపీయింగ్ వ్యవహరంలో ఒక మైనర్ బాలుడితో పాటు ఒక మరో ఇద్దరు నిందితులను కమలాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారని వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. పదోతరగతి హిందీ ప్రశ్నాపత్రం బయటికి వచ్చిన ఘటనలో ముగ్గురు అరెస్టు చేసినట్లు సీపీ ఏవీ రంగనాథ్ తెలిపారు. కమలాపూర్ బాలుర ప్రభుత్వ పాఠశాల సెంటర్ వద్ద చెట్టు ఎక్కి పేపర్ ను మైనర్ బాలుడు ఫోటో చేసినట్లు.. ఫోటో తీసి శివగణేష్ అనే వ్యక్తికి పంపగా ఆయన మహేష్ అనే వ్యక్తి పంపినట్లు విచారణ తేలిందని ఆయన పేర్కొన్నారు.
Also Read : Cop Kills Family: సర్వీస్ రివాల్వర్‌తో భార్య, కొడుకు, పెంపుడు కుక్కను చంపి.. తర్వాత..
‘ఆతర్వాత ఎస్ఎస్‌సీ 2019-20 గ్రూప్ లో పోస్ట్ చేసి వైరల్ చేశారు. జర్నలిస్టు ప్రశాంత్ అనే వ్యక్తి బ్రేకింగ్ అని హిందీ ప్రశ్నాపత్రం లీక్ అయిందని సోషల్ మీడియా పెట్టాడు. వరుసగా రెండో రోజు పేపర్ లీక్ అంటు విద్యార్థులను తల్లిదండ్రుల ఆందోళనకు గురి చేశారు. ప్రస్తుతం మైనర్ బాలుడు తోపాటు శివగణేష్, ప్రశాంత్ ను అరెస్టు చేశాం. మహెష్ పరారీలో ఉన్నారు. సోషల్ మీడియా లో వైరల్ చేసిన పలువురికి నోటీస్ లు ఇచ్చి విచారిస్తాం. క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. పరీక్ష కేంద్రం ఇన్విజిలేటర్ , చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ పై చర్యలు ఉంటాయి. వారిపై డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకుంటుంది. పేపర్ పోటో తీసిన విషయాన్ని వాళ్ళు గమనించలేదు… కానీ వారి నిర్లక్ష్యం ఉన్నట్లు భావిస్తున్నామని సీపీ రంగనాథ్ వెల్లడించారు.
Also Read : Tollywood Comedians: కమెడియన్స్ నయా ట్రెండ్.. ఏడిపించడంలో తోపులు