రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైద్యవిద్యార్ధిని ధరావత్ ప్రీతి మృతి కేసులో స్పష్టత వచ్చింది. ప్రీతి . మృతికి గల కారణాల పైనా పోలీసు స్పష్టత ఇచ్చారు ఆమెది ఆత్మహత్యే అని పోలీసు నిర్ధారించారు. పోస్టు మార్టం రిపోర్టు ఆధారంగా 306 గా ఈ కేసును నిర్ధారించమని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మెడికో ప్రీతి కేసులో పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆమె చనిపోయి రెండు నెలల తర్వాత .ఆమెది ఆత్మహత్యే అని తేల్చారు వరంగల్ పోలీసు .తన సీనియర్ సైఫ్ వేధింపులతోనే ప్రీతి ఆత్మ హత్య చేసుకొని చనిపోయిందని తేల్చిన పోలీసులు.. పోస్టుమార్టం రిపోర్టు ఆధారంగా ఆమె బాడీలో విష పదార్థాలు ఉన్నట్లు తేల్చరు.
Also Read :Bura Narsaiah Goud : వచ్చే ఎన్నికలలో నల్లగొండలో ఒక్క సీటు కూడా బీఆర్‌ఎస్ పార్టీ గెలువదు
వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఫిబ్రవరి 22న ఎంజీఎంలో అపస్మారక స్థితిలో పడి ఉండగా అక్కడి వైద్యులు గమనించి వెంటనే చికిత్స అందించారు. అయితే ఆమె పరిస్థితి మరింత విషమించడంతో హుటాహుటిన హైదరాబాద్ లోని నిమ్స్ కు తరలించారు. అక్కడ ఆమె ట్రీట్ మెంట్ పొందుతూ 26న చనిపో యింది. తన కూతురిని సీనియర్ స్టూడెంట్ సైఫ్ అనే అతను వేధించాడని ప్రీతి తల్లిదండ్రులు ఆరోపించారు. తన కూతురు మానసికంగా వేధింపులు భరించలేక చనిపోయింది అంటూ ఆరోపించారు. హత్య చేసి ఉంటారనే అనుమానం వ్యక్తం చేశారు. అయితే అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును పరిశోధన చేశారు.
అయితే ప్రీతి నిమ్స్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న టైమ్ లో రెండ్రోజుల పాటు కేఎంసీ. ఎంజీఎంలో పోలీసులు విచారణ చేపట్టారు. . ప్రీతి రూమ్ లో హాని కారక ఇంజక్షన్ లభించాయని అనే ఆత్మహత్యాయత్నం చేసిందేమో అనే అనుమానాలు వ్యక్తం చేశారు. . ఆమె సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ వివరాలను గూగుల్ లో వెతికిందన్నా పోలీసు సైఫ్ వేధింపుల కారణంగా ఆత్మహత్య యత్నం చేసి ఉంటుంది అని భావించారు.., అతణ్ని అరెస్టు చేసి మరిన్ని వివరాలు సేకరించారు.. టాక్సీకాలజీ రిపోర్టు కోసం బ్లడ్ శాంపిల్స్ తీసి పంపారు . అయితే ఈ. టాక్సీకాలజీ రిపోర్టులో ఎలాంటి విష తుల్య పదార్ధాలు బయటపడలేదు. . మార్చి 5న వచ్చిన టాక్సీకాలజీ రిపోర్టులో ప్రీతి రక్తం, అవయావాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని తేలింది. దీంతో ఖంగుతిన్న పోలీసులు మరోసారి ఎంజీఎం బాట పట్టారు. సీపీ రంగనాథ్ స్వయంగా వెళ్లి అక్కడి డాక్టర్లు, ప్రొఫెసర్లు, సిబ్బందితో విచారణ జరిపారు ఫోరెన్సిక్ రిపోర్టు కోసం వేచి చూశారు ప్రీతి చనిపోయిన నెల రోజుల తర్వాత ఫోరెన్సిక్ రిపోర్టు పోలీసులకు చేరింది. . ఈ రిపోర్టులోనూ ప్రీతి మృతికి సంబంధించి క్లారిటికి వచ్చారు. . ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీ (ఎఫ్ఎస్ఎల్)తో పాటు హిస్టోపాథాలజీ రిపోర్టు ఫైనల్ ఒపీనియన్ లో ప్రీతి డెడ్ బాడీలో విష పదార్థాలు ఉన్నట్లు వచ్చింది దింతో ప్రీతిది ఆత్మహత్య గా నిర్ధారించారు వారం 10 రోజుల్లో పోలీసు చార్జీ షీట్ ప్రవేశ పెడుతున్నారు