Nani – Nithiin: 20 ఏళ్లలో ఎంత మార్పు.. ఒకప్పుడు నితిన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్.. ఇప్పుడు అదే హీరోకు నిర్మాతగా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani – Nithiin: న్యాచురల్ స్టార్ నాని సినీ ప్రయాణం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. హీరోగా వరుస విజయాలతో స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న నాని.. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే సినీ పరిశ్రమలో నిర్మాతగా ఎదిగి తోటి హీరోలతో సినిమాలను నిర్మిస్తుండటం విశేషం. 20 ఏళ్ల క్రితం సినిమాల్లో హీరోగా అవకాశాలు రాకముందు నాని అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన చిత్రాల్లో 2005లో నితిన్ హీరోగా విడుదలైన ‘అల్లరి బుల్లోడు’ కూడా ఒకటి.
ఆ సమయంలో కెమెరా వెనుక పనిచేసిన నాని.. తర్వాత కాలంలో తన కష్టంతో, పట్టుదలతో తర్వాత హీరోగా అవకాశాన్ని అందుకుని, టాలీవుడ్లో న్యాచురల్ స్టార్‌గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. సుమారు రెండు దశాబ్దాల తర్వాత అప్పటి పరిస్థితులు పూర్తిగా మార్చుకుంటూ.. స్టార్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా సత్తా చాటుతున్న నాని.. నితిన్ హీరోగా తెరకెక్కబోతున్న ‘అలియాస్ రుక్మిణీ’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఒకప్పుడు నితిన్ సినిమా కోసం అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన నాని.. నేడు అదే హీరో సినిమాను నిర్మించే స్థాయికి ఎదగడంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు. “ఇదే నిజమైన సక్సెస్ స్టోరీ”, “కష్టపడితే అసాధ్యం అనేది ఏదీ లేదు”, “అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి స్టార్ హీరో, నిర్మాత వరకు నాని ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తి” అంటూ కామెంట్లు చేస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నాని కెరీర్లో ఈ అరుదైన మైలురాయి ఆయన సినీ ప్రయాణానికి మరో ప్రత్యేక గుర్తింపుగా నిలిచిందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Also Read
- Om: ధనుష్ - సాయిపల్లవి ‘ఓం’ కొత్త రిలీజ్ డేట్ ఇదే!
- Kalyani Priyadarshan: ఆ స్టార్ హీరోయిన్ ఇక తెలుగు సినిమాలు చేయదా? ముంబైకి మకాం మార్చడం వెనుక అసలు నిజం ఏంటి!
- Box Office Battle: దసరా బాక్సాఫీస్ విన్నింగ్ రేసులో ముందున్నదెవరు?
- Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..