ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ అంటేనే రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది. ఎలాగైన తమ టీమ్ గెలవాలని ఇరు దేశాలకు చెందిన క్రికెట్ అభిమానులు కోరుకుంటారు. కానీ ఇప్పటికే వరకు ఐసీసీ టోర్నీల్లో దాయాది జట్టైన పాక్ పై టీమిండియాకు మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. కానీ టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ గ్రూప్ స్టేజీలో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో పాకిస్థాన్ భారీ విజయం అందుకుంది. కానీ తిరిగి 2022 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా మళ్లీ గెలిచింది.. ఈ మ్యాచ్ లో రోహిత్, కేఎల్ రాహుల్ విఫలమైన ఒంటి చేతితో మ్యాచ్ ను పాకిస్థాన్ ను విరాట్ కోహ్లీ లాగేసుకున్నాడు.
Read Also: Chandrayaan-3: చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3!
ఇక, మరోసారి 2023 వన్డే వరల్డ్ కప్ కోసం పాక్ టీమ్ ఇండియాకి రానుంది. అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. దీని కంటే ముందు శ్రీలంకలో ఆసియా కప్2023 టోర్నీ కోసం రెండు లేదా మూడు సార్లు ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. అయితే, ఇండియాలో జరిగే వన్డే ప్రపంచ కప్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ వేరే లెవల్ ఉంటుంది అనుకోండి. ఇండో-పాక్ మ్యాచ్ పై మాజీ ప్లేయర్ వకార్ యూనిస్ స్పందిస్తూ.. మేం ఆడే రోజుల్లో కేవలం ఆస్ట్రేలియాలాంటి పెద్ద టీమ్‌తో ఆడినప్పుడు మాత్రమే ప్రెషర్ తీసుకునే వాళ్లమని పేర్కొన్నాడు. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఓ మినీ యుద్దమే జరిగేది. వరల్డ్ కప్ గెలవకపోయినా పర్వాలేదు కానీ.. ఇండియాతో జరిగే మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని మాకు బోర్డు చెప్పేదని అతడు తెలిపాడు.
Read Also: Kishan Reddy : రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తుంది
అప్పటి వరకు బాగా ఆడినవాళ్లం.. వరల్డ్ కప్ మ్యాచ్ అనగానే ఇండియాకి లొంగిపోయేవాళ్లం అని వకార్ యూనిస్ తెలిపాడు. అయితే ఇప్పుడున్న టీమ్ అలా కాదు.. ప్రస్తుతం క్రికెటర్లు పాక్ సూపర్ లీగ్‌తో పాటు అనేక లీగుల్లో పాల్గొంటున్నారు.. చాలామంది విదేశీ ప్లేయర్లతో కలిసి ఆడుతున్నారు.. ప్రెషర్‌ని ఎలా హ్యాండిల్ చేయాలో మా టీమ్‌కి బాగా తెలిసింది అని వకార్ పేర్కొన్నాడు. ఇప్పుడు మావాళ్లు పూర్తిగా మారిపోయారు.. పాక్ టీమ్‌తో మీ పప్పులు ఉడకవు.. మా టీమ్‌లో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు అని వకార్ యూనిస్ అన్నాడు.
Read Also: Narayana Swamy: పుంగనూర్ అల్లర్లకు చంద్రబాబే కారణం..
బాబర్ ఆజమ్, షాహీన్ ఆఫ్రిదీ, ఫకార్ జమాన్, ఇమామ్ వుల్ హక్, మహ్మద్ రిజ్వాన్.. ఇలా చాలామంది ఒంటి చేత్తో మ్యాచ్‌లను గెలిపించగలరు అని ఈ పాక్ మాజీ ప్లేయర్ పేర్కొన్నాడు. నా అభిప్రాయంలో ఈసారి అహ్మదాబాద్ లో టీమిండియా జట్టును పాకిస్తాన్ ఓడించి తీరుతుంది అంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ వకార్ యూనిస్ కామెంట్ చేశాడు. ఐసీసీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్‌లో అక్టోబర్ 15న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. అయితే అదే రోజు నవరాత్రి ఉత్సవాలు స్టార్ట్ కానుండటంతో అక్టోబర్ 14న ఇండో-పాక్ మ్యాచ్ జరుగనుంది.