Seerat Kapoor’s Stunning Tricolor-Inspired Outfit: హీరోయిన్ సీరత్ కపూర్ గుర్తు ఉన్నారా? శర్వానంద్ ‘రన్ రాజా రన్’, రవితేజ ‘టచ్ చేసి చూడు’, సిద్దు జొన్నలగడ్డ హీరోగా ‘కృష్ణ అండ్ హిజ్ లీల’, ‘మా వింత గాథ వినుమ’ సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్ కు ఆమె పరిచయం అయ్యారు. అంతేకాదు ఈ మధ్య ‘పుష్ప 2’ సినిమాలో ఆమె ఐటమ్ సాంగ్ చేస్తున్నారని కూడా ప్రచారం జరగగా ఆమె స్పందించారు కూడా. నిజానికి బన్నీతో దిగిన ఫోటోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ‘పుష్ప 2’లో ఐటమ్ సాంగ్ చేసే ఆఫర్ ఆమెకు వచ్చిందని, షూటింగ్ ఫినిష్ అయ్యాక సెల్ఫీ తీసుకున్నారని వార్తలు పుట్టుకొచ్చాయి. ఈ క్రమంలో ఆ వార్తల్లో నిజం లేదని సీరత్ కపూర్ చెప్పుకొచ్చింది.
DVV Entertainment: రేయ్ ఎవడ్రా నువ్వు.. సుజీత్ ఫొటోకి డీవీవీ షాకింగ్ కామెంట్!
అయితే ఆ సంగతి అలా ఉంచితే భారతదేశ 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మూడు ఆకర్షణీయమైన త్రివర్ణ రంగుల్లో ఉన్న చీరలు ధరించి ఫోటో షూట్ చేసి దాన్ని రిలీజ్ చేసింది. జాతీయ జెండాకు ఉన్న మూడు రంగులకు సంబంధించిన చీరల్లో మెరిసిన ఆమె అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ మూడు ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక సీరత్ కపూర్ మరో పక్క పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులలో కూడా భాగం అవుతోంది.