జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తాను ఏదైన తప్పుగా మాట్లాడితే వందల ఓట్లు పోతాయని అన్నారు. తామంతా ఓట్ల బిచ్చగాళ్లమని అంటూ కామెంట్స్ చేశారు. మేము ఒక్కో ఓటు ఎలా తెచ్చుకోవాలనే చూస్తామని.. నిజాలు మాట్లాడితే ఓట్లు పోవని సంజయ్ కుమార్ అన్నారు.
Also Read : Carona : మళ్లీ విరుచుకుపడుతున్న కరోనా.. మహారాష్ట్రలో ముగ్గురి మృతి
జగిత్యాల జిల్లా కేంద్రంలో డిగ్రీ కాలేజీలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించారు. తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ప్రతి వార్డులో కూడా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తుందని ఆయన అన్నారు. జగిత్యాలలో కూడా ప్రతి కాలనీలో ఈ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తెలిపారు. కాసేపు ఈ క్రీడా ప్రాంగణంలో ఎమ్మెల్యే వ్యాయమం చేశారు. ప్రజల అవసరాల కోసమే ఈ వ్యాయమ పరికరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సంజయ్ కుమార్ అన్నారు.
Also Read : Rashmika: నేషనల్ క్రష్ కూడా లేడీ ఓరియెంటెడ్ చేసేస్తోంది…
ఈ కార్యక్రమంలో మాట్లాడిని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. తాము ఓట్ల బిచ్చగాళ్లమని అందుకు ఎక్కడ నిజాలు చెప్పిన మాకు ఓట్లు వస్తాయని అన్నారు. మంచిగా మాట్లాడితే 300 నుంచి 500 ఓట్లు పోతాయంటూ కామెంట్స్ చేశారు. రాజకీయల్లోకి వచ్చాము కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడి ఓట్లు సంపాదించుకోవాలంటూ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. నేను ఏది మాట్లాడినా కూడా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారి మాకు వచ్చే ఓట్లు కూడా పోతున్నాయి అంటూ సంజయ్ కుమార్ అన్నారు. అందుకే తప్పుగా మాట్లాడకుండా ఆలోచించి మాట్లాడుతున్నాను అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.