Russia: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తరువాత ప్రపంచ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడితో రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ అయ్యారు. శుక్రవారం సెయింట్ పీటర్స్ బర్గ్ లో యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తో పుతిన్ సమావేశం నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆయన మొహమ్మద్ బిన్ జాయెద్ ను ప్రశంసించారు. ఎమిరేట్స్ రష్యాకు చాలా మంది భాగస్వామి అని పుతిన్ వ్యాఖ్యానించారు. ఖైదీల మార్పిడి విషయంలో రష్యా, ఉక్రెయిన్ మరియు రష్యా, అమెరికాల మధ్య యూఏఈ కీలకంగా పనిచేసిందని, పుతిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఉక్రెయిన్ వివాదం చర్చలు, రాజకీయ పరిష్కారానికి తాను సిద్ధంగా ఉన్నానని అధ్యక్షుడు అల్-నహ్యాన్ అన్నారు. ఇరువురు నేతలు ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చించారు. OPEC+ చమురు కూటమిలో రష్యా, యూఏఈ సభ్యదేశాలుగా ఉన్నాయి. ప్రపంచంలో క్రూడ్ ఆయిల్ ను ఉత్పత్తి చేసే దేశాలు ఈ కూటమిలో ఉంటాయి. ఉక్రెయిన్ తో యుద్ధం తరువాత మాస్కోకు నేరుగా దుబాయ్ విమానాలు నడిపింది.
Read Also: Komatireddy Venkat Reddy : తెలంగాణలో పరిస్థితులను సోనియాకు వివరించా
అమెరికాకు దూరం అవుతున్న అరబ్ దేశాలు:
ఇదిలా ఉంటే ఉక్రెయిన్ యుద్ధం తరువాత జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ మారిపోయాయి. అమెరికా గుత్తాధిపత్యాన్ని పలు దేశాలు ప్రశ్నిస్తున్నాయి. ఉక్రెయిన్-రష్యా వివాదంలో యూరప్ లోని కొన్ని దేశాలు, అమెరికా తప్పితే వేరే దేశాలు పెద్దగా కలుగజేసుకోవడం లేదు. సాంప్రదాయకంగా అరబ్ ప్రపంచంలో శక్తివంతమైన దేశాలు అయిన సౌదీ అరేబియా, యూఏఈలు అమెరికా విలువైన మిత్రదేశాలుగా ఉన్నాయి. అయితే బైడెన్ అధ్యక్షుడు అయిన తర్వాత సౌదీ రాజు మహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా ఆధిపత్యాన్ని ఒప్పుకోవడం లేదు. ఇందుకు ఖషోగ్గీ అనే జర్నలిస్టు హత్య కారణం అయింది.
ఇదిలా ఉంటే మరోవైపు బద్దశతృవులైన సౌదీ అరేబియా, ఇరాన్ దేశాల మధ్య సంబంధాలు బలపడేందుకు చైనా సహకరిస్తోంది. మరోవైపు యూఏఈ, సౌదీలు ఇజ్రాయిల్ తో సన్నిహితంగా మెలుగుతున్నాయి. ఈ పరిణామా మధ్య అరబ్ దేశాలు అమెరికాకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.