Vivo X200 FE: వివో తన X200 సిరీస్‌లో భాగంగా vivo X200 FE పేరుతో మరో ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన ఫీచర్లు, అత్యాధునిక ప్రాసెసింగ్ సామర్థ్యం, అదిరిపోయే డిస్ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్‌తో ఈ ఫోన్ ప్రీమియం సెగ్మెంట్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని విడుదల చేసింది. మరి ఈ ప్రీమియం మొబైల్ సంబంధించిన పూర్తి వివరాలను చూద్దామా..
డిస్ప్లే:
ఈ కొత్త Vivo X200 FE మొబైల్ లో 6.31 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4320Hz PWM డిమ్మింగ్, అలాగే 5000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను అందిస్తుంది. ఈ ఫోన్‌లో హై రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే కావడంతో స్క్రోలింగ్, వీడియోలు చూడడం చాలా స్మూత్ గా అనిపిస్తాయి.
ప్రాసెసర్:
ఈ ఫోన్‌లో MediaTek Dimensity 9300+ 4nm చిప్‌సెట్ ను ఉపయోగించారు. ఇది Immortalis-G720 GPU ను కూడా కలిగి ఉంది. ఈ మొబైల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇందులో 12GB లేదా 16GB LPDDR5X ర్యామ్, 256GB లేదా 512GB UFS 3.1 స్టోరేజ్‌తో అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఈ మొబైల్ మల్టీటాస్కింగ్, హై ఎండ్ గేమింగ్ కు సూపర్ చాయిస్.
ట్రిపుల్ కెమెరా సెటప్:
Vivo X200 FE ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా (Sony IMX921) తో పాటు, 8MP అల్ట్రా వైడ్ కెమెరా, 50MP 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (Sony IMX882) ఉన్నాయి. ఫ్రంట్ కెమెరా కూడా 50MP ఆటోఫోకస్‌తో రావడంతో సెల్ఫీ ప్రియులకు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తుంది.

భారీ బ్యాటరీ:
ఈ మొబైల్ లో 6500mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. దీని ద్వారా తక్కువ సమయంలోనే పూర్తి ఛార్జ్ పొందవచ్చు. దీన్ని గేమింగ్, ఫోటోగ్రఫీ లేదా టెక్ వర్క్ కోసం అత్యుత్తమ ఎంపికగా మారుస్తుంది.
Read Also:Ahmedabad Plane Crash: పరిహారం కాదు.. జవాబుదారీతనం కావాలి.. నివేదికపై బాధిత కుటుంబాలు ఆందోళన
రెసిస్టెన్స్:
ఈ మొబైల్ కు IP68 + IP69 రేటింగ్స్ ఉన్నాయి. కాబట్టి ఈ మొబైల్ కు నీటి, ధూళి సమస్యలే ఉండవు. ఇది రోజువారీ వాడకానికి ఎంతో భద్రతను అందిస్తుంది.

ఇతర ముఖ్య ఫీచర్లు:
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ లో ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS 15, ఇన్ డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, స్టీరియో స్పీకర్లు, Hi-Res ఆడియో సపోర్ట్, USB Type-C ఆడియోలు లభించనున్నాయి.
ధర, లాంచ్ ఆఫర్లు:
vivo X200 FE రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ.59,999గా ధర నిర్ణయించారు. ఈ ఫోన్ జూలై 23వ తేదీ నుంచి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా అధికారిక వెబ్‌సైట్, అథరైజ్డ్ రిటైల్ షాపుల్లో లభ్యం కానుంది. ప్రీ బుకింగ్స్ నేటి నుంచే ప్రారంభమయ్యాయి.

వివో కంపెనీ ఈ ఫోన్‌పై పలు ఆకర్షణీయమైన లాంచ్ ఆఫర్లు కూడా అందిస్తోంది. ఈ ఫోన్‌ను నెలకు కేవలం రూ.3,055 EMIతో పొందే అవకాశం ఉంది. అలాగే 18 నెలల No Cost EMI, జీరో డౌన్ పేమెంట్ ఆప్షన్‌తో అందిస్తున్నారు. ఇంకా, SBI, HDFC, IDFC First, DBS, HSBC, Yes Bank వంటి ఎంపికైన బ్యాంక్ కార్డులపై 10% ఇన్స్టెంట్ క్యాష్‌బ్యాక్, లేదా 10% V-Upgrade ఎక్స్‌చేంజ్ బోనస్ తో పాటు 1 సంవత్సరం ఉచిత ఎక్స్‌టెండెడ్ వారంటీను కూడా అందిస్తోంది.
అంతేకాకుండా, V-Shield ప్లాన్‌పై 70% డిస్కౌంట్ తో పాటు వివో TWS 3e ట్రూ వైర్లెస్ ఈయర్‌బడ్స్‌ను కేవలం రూ.1,499కే పొందే ప్రత్యేక బండిల్ డీల్ కూడా ఉంది. ఈ ప్యాకేజీ మొత్తం ప్రీమియం ఫోన్‌ను తీసుకోవాలనుకునే వారికి నిజంగా అద్భుత అవకాశం కానుంది.