Vivo T2 Pro 5G Launch: వివో నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ రిలీజ్.. కర్వడ్ డిస్‌ప్లే, 64ఎంపీ కెమెరా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vivo T2 Pro 5G Smartphone Launches in India with Rs 23,999: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ‘వివో’ మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం భారత మార్కెట్‌లో రిలీజ్ చేసింది. అదే ‘వివో టీ2 ప్రో 5జీ’ స్మార్ట్‌ఫోన్. మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్ రిలీజ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ కర్వడ్-సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్ వంటి మెరుగైన ఫీచర్లతో వచ్చింది. సెప్టెంబర్ 22న మధ్యాహ్నం 12 గంటలకు వివో టీ2 ప్రో 5జీ ఫోన్ భారత్‌లో లాంచ్ అవనుందని ‘వివో ఇండియా’ తన ఎక్స్‌లో ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఫోన్ ధర, ఫీచర్ల వివరాలను ఓసారి చూద్దాం.
Vivo T2 Pro 5G Price:
వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. 8జీబీ+128జీబీ వేరియంట్ ధర రూ. 23,999గా ఉండగా.. 8జీబీ+256 జీబీ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. సెప్టెంబర్ 29 నుంచి ఈ ఫోన్ విక్రయాలు ఆరంభం కానున్నాయి. వివో వెబ్‌సైట్, ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అమ్మకాలు అందుబాటులో ఉంటయ్యి. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే.. రూ. 2వేలు డిస్కౌంట్ పొందొచ్చు. వెయ్యి రూపాయలు అదనపు బోనస్ కూడా ఉంది.
Also Read
- Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
- CJI Surya Kant: "యువత మాట వినండి".. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
- 144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
Vivo T2 Pro 5G Specs:
వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 6.78 ఇంచెస్ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ 3డీ కర్వ్‌డ్ అమోలెడ్ ప్యానెల్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేటు, 1300 నిట్స్ బ్రైట్‌నెస్ డిస్‌ఫ్లే ఇందులో ఉంటుంది. ఈ ఫోన్ మందం 7.36 ఎంఎం కాగా.. బరువు175 గ్రాములు. వివో టీ2 ప్రో 5జీ ఫోన్ ఆక్టాకోర్ డిమెన్‌సిటీ 7200 ప్రాసెసర్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13తో ఈ ఫోన్ పనిచేస్తుంది.
Also Read: IND vs AUS: టాస్ నెగ్గిన భారత్.. అయ్యర్, అశ్విన్ వచ్చేశారు! తిలక్‌కు షాక్
Vivo T2 Pro 5G Camera and Battery:
వివో టీ2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 64 ఎంపీ ప్రధాన కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. బ్యాక్ కెమెరా ఓఐఎస్ సపోర్ట్‌తో 4K వీడియోలను క్యాప్చర్ చేయగలదు. 4600 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్.. 66W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇందులో ఉంటుంది. ఎపిక్ గేమింగ్, స్ట్రీమింగ్ ఎక్స్‌పీరియన్స్ ఈ ఫోన్ ద్వారా మీరు పొందనున్నారు.
తాజావార్తలు
-
Steel Bridge: హైదరాబాద్ వాసులకు శుభవార్త.. మరో స్టీల్ బ్రిడ్జి అందుబాటులోకి..
-
CJI Surya Kant: “యువత మాట వినండి”.. విద్యార్థుల నిరసనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
YS Jagan: చంద్రబాబు పాలనలో రైతులు రోడ్డున పడ్డారు.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు!
-
SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
-
144Hz డిస్‌ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
ట్రెండింగ్
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్‌కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా వీవీఎస్ లక్ష్మణ్?