IND vs AUS: టాస్ నెగ్గిన భారత్.. అయ్యర్, అశ్విన్ వచ్చేశారు! తిలక్‌కు షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India have won the toss and have opted to field vs Australia in 1st ODI : మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదటి వన్డే ఆరంభం కానుంది. మొహాలీలోని పీసీఏ ఐఎస్ బింద్రా స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. శ్రేయాస్ అయ్యర్, రవిచంద్రన్ అశ్విన్, రుతురాజ్ గైక్వాడ్ తుది జట్టులోకి వచ్చారు. సూర్యకుమార్ యాదవ్‌కు మరో అవకాశం దక్కింది. అయితే తెలుగు ఆటగాడు తిలక్ వర్మకు నిరాశే ఎదురైంది.
ఆస్ట్రేలియా పటిష్ట జట్టుతో బరిలోకి దిగుతోంది. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్, మిచెల్ మార్ష్ లాంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. దక్షిణాఫ్రికా పర్యటనలో వన్డే సిరీస్‌ను కోల్పోయిన ఆసీస్.. భారత గడ్డపై సత్తా చాటాలని చూస్తోంది. మరోవైపు ఆసియా కప్ 2023 గెలిచి జోరు మీదున్న భారత్.. ఆస్ట్రేలియాపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తోంది. వన్డే వరల్డ్‌కప్ 2023కి ముందు ఇరు జట్లకు ఈ సిరీస్ సన్నాహకంగా ఉపయోగపడనుంది.
Also Read
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
- Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
- Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా 'అర్నబ్' తుఫాను శాటిలైట్ ఫొటోలు..
తుది జట్లు:
భారత్: శుభమన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, లోకేష్ రాహుల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, పాట్ కమిన్స్ (కెప్టెన్), సీన్ అబాట్, ఆడమ్ జంపా.
#TeamIndia have won the toss and elect to bowl first in the 1st ODI against Australia.
Live – https://t.co/H6OgLtww4N… #INDvAUS pic.twitter.com/s8Y71dRLMr
— BCCI (@BCCI) September 22, 2023
తాజావార్తలు
-
Mouli: ఫ్యూచర్ ప్రాజెక్టులపై యంగ్ హీరో బోల్డ్ కామెంట్స్!
-
Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
-
Arnab Cyclone: మరోసారి చంద్రబాబు సమీక్ష.. ప్రస్తుత పరిస్థితి ఇది..! విద్యుత్, రహదారుల పునరుద్ధరణపై కీలక ఆదేశాలు
-
Water Usage Rules : తెలంగాణలో నీటి వినియోగంపై కొత్త రూల్స్.. సీఎం కీలక ఆదేశాలు
-
Arnab Cyclone Damages: అర్నబ్ తుఫాన్ దెబ్బ.. రాష్ట్రవ్యాప్తంగా 126.165 కి.మీ. రహదారులు ధ్వంసం
ట్రెండింగ్
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!