Vishal : తన ఆస్తుల వివరాలను కోర్ట్ కి సమర్పించిన విశాల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ఇటీవల `మార్క్ ఆంటోని` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఈ సినిమా మంచి ఆదరణ అందుకుంటుంది.. విశాల్ నటించిన గత చిత్రాలతో పోల్చి చూస్తే ఈ సినిమా కాస్త బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఓ రకంగా చెప్పాలంటే ఈ సినిమాతో విశాల్ కాస్త ఊరట పొందాడని చెప్పొచ్చు. అయితే విశాల్ కోర్ట్ కేసు ను ఎదుర్కోవల్సి వచ్చింది.తాజాగా ఆయన ఏకంగా తన ఆస్తులను, బ్యాంక్ బ్యాలెన్స్ వివరాలను కోర్ట్ కి సమర్పించడం చర్చనీయాంశంగా మారింది.అస్సలు ఏం జరిగిందంటే…హీరో విశాల్ తన సినిమాలను ఆయనే నిర్మిస్తూ వుంటారు.ఈ క్రమంలో ఫైనాన్షియర్ అన్బచెలియన్ వద్ద ఆయన సుమారు 21.29కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు.తాను కట్టలేని స్థితిలో ఆ అమౌంట్‌ని లైకా సంస్థ చెల్లించింది. అందుకు గాను విశాల్ నిర్మించే సినిమాల హక్కులను లైకా సంస్థ ఇవ్వాల్సింది గా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఇటీవల విశాల్ హీరోగా నటించి, నిర్మించిన `వీరమే వాగై చుడుమ్` చిత్ర హక్కులను లైకాకి కాకుండా వేరే సంస్థకి విక్రయించారు. దీంతో లైకా ప్రొడక్షన్ సంస్త మద్రాస్ హైకోర్ట్ ని ఆశ్రయించింది. ఈ కేసుకి సంబంధించిన విచారణ మద్రాస్ హైకోర్ట్ లోని ప్రత్యేక న్యాయస్థానంలో జరిగింది.ఈ నెల 12 వ తేదీన ఈ కేసుని విచారించిన న్యాయమూర్తి పీటీ ఉషా.. విశాల్ తన స్థిరాస్తులు, బ్యాంక్ ఖాతాల వివరాలను కోర్ట్ కి సమర్పించాలని ఆదేశించారు.. కానీ విశాల్ వాటిని పట్టించుకోలేదు. దీంతో ఈ నెల 19న జరిగిన విచారణలో కోర్ట్ దీన్ని కోర్ట్ ధిక్కరణ కిందకి పరిగణించాల్సి వస్తుందని విశాల్ ను హెచ్చరించింది. సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఇందులో విశాల్ తన ఆస్తుల వివరాలను కోర్ట్ కి అందించారు. స్టాండర్డ్ చార్టెడ్, ఐడీబీఐ, యాక్సెస్, హెచ్‌డీ ఎఫ్‌సీ మరియు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాల వివరాలను కూడా సమర్పించారు. కానీ ఇందులో పూర్తి వివరాలు లేకపోవడంతో రిట్ పిటిషన్ దాఖలు చేయల్సిందిగా లైకాని కోర్ట్ ఆదేశించింది
Also Read
- Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
తాజావార్తలు
-
Ind Vs WI: ఆఖర్లో టీమిండియా మెరుపులు.. ముగిసిన భారత్ బ్యాటింగ్..
-
PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
-
Festive Sale: పండుగ షాపింగ్ తుఫాన్.. 48 గంటల్లో రూ.24,000 కోట్ల సేల్స్!
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!