Foreign Tourist Drowns at Yarada Beach: విశాఖలో అలలు తాకిడికి ఇద్దరు విదేశీయులు కొట్టుకుపోయారు. యారాడ బీచ్ లో స్నానానికి దిగి అలలు ధాటికి కొట్టుకుపోయారు. ఇటలీ నుంచి 16 మంది పర్యాటకులు విశాఖకి వచ్చారు. అలలు తాకిడికి కొట్టుకుపోయి ఓ విదేశీయుడు మృతి చెందాడు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సరదాగా గడిపేందుకు వచ్చిన విదేశీయులు బీచ్‌కి వచ్చారు. సముద్ర తీరంలో ఆడుకుంటూ, తరువాత లోపలికి వెళ్ళారు. కానీ ఎప్పటికప్పుడు మారే అలల వేగాన్ని అంచనా వేయకపోవడంతో వారిని ఒక్కసారిగా అలలు లోనికి లాక్కుపోయాయి. కేకలు విన్న ఇతరులు వెంటనే స్థానికులు లైఫ్ గార్డ్స్ కు సమాచారం అందించారు. కొట్టుకుపోతున్న ఇద్దరిని రక్షించే ప్రయత్నం లైఫ్ గార్డ్స్ ప్రయత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.
READ MORE: Karimangar : కోతులను వెళ్లగొట్టినోళ్లకే ఓట్లు వేస్తారంట..!