Aaryavir Sehwag: ప్రస్తుత రోజుల్లో క్రికెట్ ఆటగాళ్ళు టెస్ట్ మ్యాచ్‌లలో కూడా టి20 మ్యాచ్ ఆడుతున్నట్లుగా బ్యాటింగ్ చేస్తున్నారు. కాకపోతే ఇది వరకు దశాబ్దం క్రితం టెస్టు క్రికెట్ అంత ఈజీ కాదు. ఆ సమయంలోనే భారత డాషింగ్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి బౌలర్లను విపరీతంగా బాధేసేవాడు. ఇప్పుడు, సెహ్వాగ్ కొడుకు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా తన తండ్రిలానే నడుస్తున్నట్లు కనపడుతోంది. తాజాగా మ్యాచ్ లో అద్భుతాలు చేశాడు. కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడుతూ ఆర్యవీర్ డబుల్ సెంచరీ సాధించాడు.
Also Read: Koti Deepotsavam 2024 Day 13 LIVE: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహ స్వామి కల్యాణం.. ప్రత్యక్షప్రసారం
నవంబర్ 21న మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో ఆర్యవీర్ డబుల్ సెంచరీ సాధించాడు. కేవలం 229 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను రెండో రోజు ఆట ముగిసే వరకు 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఆర్యవీర్ డబుల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 34 ఫోర్లు, 2 సిక్సర్లు కొట్టాడు. అంతేకాదు, అతని స్ట్రైక్ రేట్ 87.34. వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు కూచ్ బెహార్ ట్రోఫీలో ఆడడం ఇదే తొలిసారి. అతని ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ.
ఈ మ్యాచ్‌లో అర్నవ్ బగ్గాతో కలిసి 17 ఏళ్ల ఆర్యవీర్ 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 114 పరుగులతో సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అర్నవ్, ధన్య నక్రాతో కలిసి 188 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ధన్యా నక్ర అజేయంగా 98 పరుగులు చేసి క్రీజులో ఉన్నాడు. వెటరన్ క్రికెటర్ కుమారుడు వినూ మన్కడ్ ట్రోఫీ మ్యాచ్‌లలో ఇప్పటికే మంచి ప్రదర్శన చేసి వార్తల్లో నిలిచాడు. ఆ టోర్నమెంట్‌లో, అతను 49 పరుగుల ముఖ్యమైన ఇన్నింగ్స్‌ని ఆడి, జట్టు గెలవడంలో ముఖ్యమైన సహకారం అందించాడు.
Also Read: Terrorist Attack: ఉగ్రదాడిలో 50 మంది హతం..
వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు బ్యాటింగ్‌కు పేరుగాంచాడు. తన కెరీర్‌లో భారతదేశం తరపున 104 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. అందులో ఏకంగా 6 డబుల్ సెంచరీలు ఉన్నాయి. ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది. సెహ్వాగ్ ఈ సుదీర్ఘ ఫార్మాట్‌లో 8,586 పరుగులు చేశాడు. 6 డబుల్ సెంచరీలతో పాటు, అతను 23 సెంచరీ ఇన్నింగ్స్‌లు కూడా ఆడాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్ కూడా సెహ్వాగ్ పేరునే ఉంది. అతను 91 సిక్సర్లు కొట్టాడు. ఈ రికార్డ్ సమీపాన రోహిత్ శర్మ కేవలం 3 సిక్సర్ల దూరంలో ఉన్నాడు.