కరోనా కారణంగా చాలా సినిమాల పరిస్థితి సందిగ్ధంలో పడిపోయింది. కొన్ని సినిమాలు షూటింగ్‌లు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. షూ టింగ్‌లు పూర్తి చేసుకున్నా విడుదలకు నోచుకుని సినిమాలు ఇంకా ఎన్నో ఎన్నెన్నో.. కొన్ని సినిమాలు థియేట్రికల్ రీలీజ్‌ను స్కిప్ చేసి ఓటీటీలోనే విడుదలయ్యాయి. ఇంకొన్ని సినిమాలయితే అసలు ఓటీటీలో విడుదల చేయాల..? లేక థియేట్రికల్ రిలీజ్ కోసం ఎదురు చూడాలా అనే విషయంలో ఇప్పటికి డైలామా స్థితిలోనే ఉన్నాయి. అందులో ఒకటి విరాటపర్వం సినిమా.. దగ్గుబాటిరానా, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేశారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను తెరకెక్కించారు. గతేడాది వేసవిలో రావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా వాయిదాల మీద వాయిదా పడింది. సినిమాలన్నీ ఒక్కొక్కటిగా ప్రేక్షకుల ముం దుకు వస్తున్నాయి. కానీ విరాటపర్వం సినిమాలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుక్కుందని నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగింది.కానీ నెలలు గడుస్తున్నా రిలీజ్ సం గతి చెప్పటం లేదు. తాజా సమాచారం ప్రకారం విరాట పర్వం ఓటీటీ డీల్‌ను క్యాన్సిల్ చేశారట. ఈ సినిమాను నేరుగా థియేటర్లలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా కు సంబంధించిన రిలీజ్ విషయంలో స్పష్టత ఇవ్వనున్నారు. మూవీ మేకర్స్. జనవరి నెలాఖరు లేదంటే ఫిబ్రవరిలో ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది.