Virat Kohli: ఫీల్డ్‌లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని.. వీడియో వైరల్
- రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్ Dలో భాగంగా రైల్వేస్, ఢిల్లీ మ్యాచ్ మ్యాచ్.
- ప్రేక్షకులతో నిండిపోయిన స్టేడియం.
- 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.
- ఫీల్డ్‌లోకి దూసుకొచ్చి విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని..
- సోషల్ మీడియాలో వీడియో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రంజీ ట్రోఫీ 2024-25 ఎలైట్ గ్రూప్ D మ్యాచ్‌లో భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రైల్వేస్‌తో ఆడుతున్నాడు. 12 ఏళ్ల తర్వాత రంజీ మ్యాచ్ ఆడుతున్న కోహ్లీని చూసేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు ఢిల్లీ స్టేడియంకు చేరుకున్నారు. జనవరి 30, మొదటి రోజు ఆట ఉదయం సెషన్‌లో ఒక అభిమాని భద్రతా వలయాన్ని దాటుకొని మైదానం మధ్యలోకి చేరుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: Wriddhiman Saha: క్రికెట్ కెరీర్లో చివరి మ్యాచ్ ఆడనున్న వృద్ధిమాన్ సాహా
Also Read
ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న అనేక వీడియోలలో అభిమాని స్లిప్‌ల వైపు పరిగెత్తడం, విరాట్ పాదాలను తాకడం చూడవచ్చు. ఘటన జరిగిన వెంటనే, అభిమానిని భద్రతా అధికారులు పట్టుకున్నారు. వైరల్ అవుతున్న వీడియోను గమనించినట్లయితే, కోహ్లి అభిమానిని కొట్టవద్దని భద్రతా అధికారులను అభ్యర్థిస్తున్నట్లు చూడవచ్చు. నవంబర్ 2012 తర్వాత కోహ్లీ ఆడనున్న తొలి రంజీ ట్రోఫీ మ్యాచ్ కావడంతో గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 15,000 మందికి పైగా అభిమానులు హాజరయ్యారు. DDCA (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్) కోహ్లీ ఆడుతుండడంతో దాదాపు 10,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా వేసింది. అయితే, కోహ్లి క్రేజ్ ఎంతగా ఉందంటే తెల్లవారుజామున 3 గంటల నుంచే స్టేడియం బయట జనం గుమిగూడారు. దాదాపు 15 వేల మంది స్టేడియం లోపల ఉంటారని, అలాగే దాదాపు అంతే మొత్తంలో స్టేడియం బయట కూడా ఉంటారని సమాచారం.
Also Read: GHMC Council Meeting: బడ్జెట్ ప్రవేశపెట్టిన జీహెచ్‌ఎంసీ మేయర్.. కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం!
ఢిల్లీ కెప్టెన్ ఆయుష్ బడోని టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నందున విరాట్ కోహ్లీ జట్టు మొదట ఫీల్డింగ్ చేస్తోంది. దీనితో కోహ్లి రేపు మైదానంలో బ్యాటింగ్‌కు వస్తాడని భావిస్తున్నారు. కోహ్లీ తన రెగ్యులర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని ఢిల్లీ కెప్టెన్ ఇప్పటికే ధృవీకరించాడు. ఇక రెండు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ ను చూస్తే..
A fan entered the ground to meet Virat Kohli & he touched Kohli's feet. 🥹❤️ pic.twitter.com/97SyZleaNv
— Virat Kohli Fan Club (@Trend_VKohli) January 30, 2025
ఢిల్లీ: సనత్ సాంగ్వాన్, అర్పిత్ రాణా, యశ్ ధుల్, విరాట్ కోహ్లీ, ఆయుష్ బడోని (కెప్టెన్), ప్రణవ్ రాజ్‌వంశీ (వికెట్ కీపర్), సుమిత్ మాథుర్, శివమ్ శర్మ, నవదీప్ సైనీ, మణి గ్రేవాల్ మరియు సిద్ధాంత్ శర్మ.
రైల్వేస్: అంచిత్ యాదవ్, వివేక్ సింగ్, మహ్మద్ సైఫ్, సూరజ్ అహుజా (కెప్టెన్), ఉపేంద్ర యాదవ్ (వికెట్ కీపర్), భార్గవ్ మెరాయ్, కర్ణ్ శర్మ, అయాన్ చౌదరి, హిమాన్షు సాంగ్వాన్, కునాల్ యాదవ్ మరియు రాహుల్ శర్మ.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!